
అసలు రాజకీయాలు పుట్టిందే బెజవాడలో అనే నానుడి బాగా ప్రాచుర్యంలో ఉంటుంది. అయితే రాజకీయాలకు కంచుకోటగా చెప్పబడే విజయవాడ వైసీపీ పాలిట అనకొండలా మారింది. 2014 నుండి 2024 వరకు విజయవాడ వైసీపీ ఎంపీ గా ఏ అభ్యర్థి పోటీ చేసినా ఆయన రాజకీయ జీవితానికి అక్కడితో తెరపడినట్టుగానే కనపడుతుంది.
2014 లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కోనేరు రాజేంద్ర ప్రసాద్, 2019 ఎన్నికలలో పొట్లూరి వర ప్రసాద్ (పివిపి) వైసీపీ తరుపున బరిలో దిగగా అప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న కేశినేని నాని విజయకేతనం ఎగరేశారు. అయితే 2024 లో వినూత్నంగా టీడీపీ కండువా తీసి వైసీపీ కండువా వేసుకుని అదే విజయవాడ ఎంపీగా కేశినేని నాని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
అయితే ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యి టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో కేశినేని నాని ఓటమి పాలయ్యారు. తమ్ముడి చేతిలో ఓడిపోవడం భరించలేని కేశినేని నాని ప్రజల నుంచి వచ్చిన తిరస్కరణను తట్టుకోలేక తిరిగి టీడీపీలో చేరలేక అలా అని వైసీపీలో కొనసాగలేక రాజకీయ జీవితానికి స్వస్తి చెపుతూ రాజకీయ సన్యాసాన్ని స్వీకరించారు.
అయితే 2014 , 2019 ఎన్నికలలో ఓడిపోయిన ఇద్దరు వైసీపీ ఎంపీ ల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా కొనసాగింది. విజయవాడ వైసీపీ ఎంపీ గా ఓడిపోయిన కోనేరు రాజేంద్ర ప్రసాద్ కానీ పివిపి కానీ ఆ తరువాత ఏ రాజకీయ వేదికల మీద కానీ మరే రాజకీయ ఎన్నికలలో కానీ పాల్గొనలేదు. దీనితో విజవాడ వైసీపీ ఎంపీ గా పోటీ చేస్తే ఓడిపోవడం ఆ తరువాత రాజకీయ సన్యాసం తీసుకోవడం అనేది ఒక సెంటిమెంట్ గా బలపడిపోయింది.
ఇలా రాష్ట్ర విభజన తరువాత జరిగిన 3 ఎన్నికలలో విజయవాడ వైసీపీ ఎంపీ లుగా ఓడిపోయిన ముగ్గురు రాజకీయ సన్యాసాన్ని స్వీకరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన లగడపాటి రాజగోపాల్ కూడా రాష్ట్ర విభజన తరువాత రాజకీయ కాషాయం కప్పుకున్నవారే. ఇక నుండి విజయవాడ వైసీపీ ఎంపీ గా పోటీ చేసే వ్యక్తులు గెలిస్తే ఎంపీ గా కొనసాగుతారు ఓడిపోతే రాజకీయ సన్యాసులుగా మిగులుతారు అనేదానిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిందేగా..!
Baahubali took South cinema to the next level. SS Rajamouli showed the industry that regional…
Prior to the 2024 Andhra Pradesh election, YS Jagan had this coin term of Siddham.…