
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలతో సక్సెస్ అందుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని డ్యూయల్ రోల్ చేసిన ఈ ట్రైలర్ ఫక్తు కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉంది గానీ, సినిమాపై ఆసక్తిని మాత్రం పెంచలేకపోయింది. ఇటీవల కాలంలో నాని సినిమాల ట్రైలర్ చూసిన వెంటనే ‘ఈ సినిమా చూడాలి’ అనిపించే విధంగా ఉండగా, ‘కృష్ణార్జున యుద్ధం’ ట్రైలర్ మాత్రం ఆ అనుభూతిని కలిగించలేకపోయింది. అది కూడా నాని డ్యూయల్ రోల్స్ లో చేసినా కూడా!
ఏప్రిల్ 12న సిల్వర్ స్క్రీన్ పై అదరగొట్టేస్తుందేమో ఇప్పుడే చెప్పలేం గానీ, ట్రైలర్ కటింగ్ మరింత్ షార్ప్ గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. యధావిధిగా నాని తన నటన ‘నాచురల్’గా ఉండగా, ఇద్దరు హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, రుక్షర్ ధిల్లాన్ లు కనువిందు చేయనున్నారు. హిప్ హాప్ అందించిన సంగీతం శ్రోతలను అలరించగా, ఈ ట్రైలర్ ‘ఓకే’ అనిపించింది. ఎవరికీ సాధ్యం కాని విధంగా వరుసగా 9 సక్సెస్ లు నమోదు చేసి నాని సరికొత్త చరిత్ర లిఖించాలని మాత్రం ఆశిద్దాం.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…