
నేడు త్రిష పుట్టినరోజు కావడం తో తిరుమల శ్రీ వారి దర్శనానికి విచ్చేసారు. దానికి తోడు నేడు తమిళనాడు ఎన్నికల ఫలితాలు కూడా విడుదల కావడం ఈ ఏడాది త్రిష పుట్టిన రోజు సం థింగ్ స్పెషల్ కానుంది.
దళపతి విజయ్ – త్రిష మధ్య ఎదో నడుస్తుంది అంటూ తమిళనాడు ఎన్నికల ప్రచారం సందర్భంగా వీరిద్దరి పై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దానికి తోడుకి విజయ్ – త్రిష కలిపి ఒక వివాహ వేడుకకు విచ్చేయడం కూడా ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చాయి.
దీనితో విజయ్ – త్రిష మధ్య సం థింగ్ అనే ప్రచారం ధృఢంగా తయారయ్యింది. ఈ నేపథ్యంలో త్రిష తిరుమల పర్యటన కూడా విజయ్ TVK విజయం కోసమే అన్నట్టుగా ప్రచారం సాగుతుంది. అయితే ఈ రూమర్స్ ను కాసేపు పక్కన పెడితే విజయ్ TVK తమిళనాడు రాజకీయాలలో చరిత్ర సృష్టించేలా కనిపిస్తుంది.
ఇప్పటి వరకు కనిపిస్తున్న ట్రెండ్స్ ప్రకారం విజయ్ TVK సెంచరీ కొట్టారు. ఇది ఇలానే కొనసాగితే విజయ్ తమిళనాడులో MGR రికార్డు ను బద్దలు కొట్టినవారవుతారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ గమనిస్తే విజయ్ సీఎం కావడం ఖాయంగా కనిపిస్తుంది.
వార్ వన్ సైడ్ అన్నట్టుగా విజయ తమినాడు ఎన్నికలను తన వైపుకి తిప్పుకోగలిగారు. దీనితో ఈ ఏడాది త్రిష పుట్టిన రోజు సం థింగ్ స్పెషల్ అనేది తేలిపోయింది. నిజంగా విజయ్ – త్రిషకు మధ్య సం థింగ్ ఉంటే ఆ సం థింగ్ ని స్పెషల్ థింగ్ గా మార్చేందుకు విజయ్, త్రిష పెద్దగా సమయం తీసుకోకపోవచ్చు.
There was a time when a release date was announcement in Tollywood it carried real…
Friday saw several films hit theatres, but Fahadh Faasil’s Don’t Trouble the Trouble and Jason…