Telugu

మహేష్ మాత్రమే కాపాడాలి!

ఇటీవల కాలంలో ఏ సినిమాపై లేనంతగా “గుంటూరు కారం” నిరంతరం వార్తల్లో నిలుస్తూ వచ్చింది. షూటింగ్ మొదలుపెట్టిన నాటి నుండి ట్రైలర్ రిలీజ్ వరకు అంతా గందరగోళంగా “గుంటూరు కారం” ప్రయాణం సాగింది. తొలి షెడ్యూల్ ముగిసిన తర్వాత కధ మార్పు అంటూ బయటకు వచ్చిన విషయం నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ వెన్యూ మార్పు వరకు నిరంతరాయంగా నడిచింది.

హీరోయిన్ మార్పు, సినిమాటోగ్రాఫర్ మార్పు, ఫైట్ మాస్టర్స్ మార్పు, అలాగే మధ్యలో సంగీత దర్శకుడు థమన్ కూడా మార్పు అని కూడా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఇన్ని అవాంతరాలు ఎదుర్కొంటూ విడుదలకు సిద్ధమైన “గుంటూరు కారం” అభిమానులు, ప్రేక్షకుల అంచనాలను అందుకునే విధంగా ఉండబోతోందా? అంటే…

ADVERTISEMENT

ధియేటిరికల్ ట్రైలర్ మాత్రం ఆ నమ్మకాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయింది. దానికి ప్రధాన కారణం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన అంచనాలే. గతంలో మహేష్ ను “అతడు, ఖలేజా” సినిమాలో అత్యద్భుతంగా చూపించిన త్రివిక్రమ్, ఈ సారి తన రొటీన్ సినీ ఫార్ములాకు సూపర్ స్టార్ ను బలి చేయబోతున్నారా? అన్న ప్రశ్నను లేవనెత్తింది.

‘అత్తారిటింటికి దారేది’ సినిమా నుండి ‘అలా వైకుంఠపురం’ వరకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాల జయాపజయాలను పక్కన పెడితే, అవన్నీ ఒక ‘సినీ ఫార్ములా’ తరహాలోనే ఉంటాయి. ముఖ్యంగా తన సహజశైలికి విభిన్నంగా ‘నాన్ సింక్’ కామెడీకి పెద్ద పీట వేయడం త్రివిక్రమ్ స్థాయి ఉన్న దర్శకుడి నుండి ఏ మాత్రం ఆశించదగ్గ పరిణామం కాదు.

అయితే ఆయా సినిమాలు బాక్సాఫీస్ వద్డ కనకవర్షం కురిపించడంతో, “గుంటూరు కారం”ను కూడా అదే తరహాలో తెరకెక్కించారా? అన్న సందేహాలకు ట్రైలర్ తావిచ్చింది. ఆదివారం నాడు రిలీజ్ అయిన ట్రైలర్ దాదాపుగా 24 గంటలలో రికార్డు వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకుపోతున్న మాట వాస్తవమే. అయితే ఇదంతా సిల్వర్ స్క్రీన్ పై సినిమాకు దోహదం చేస్తుందా? అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి.

ట్రైలర్ లో మహేష్ బాబు నటన, స్క్రీన్ ప్రజెన్స్ తప్ప హైలైట్ అయిన విషయాలలో హీరోయిన్ శ్రీలీల మాత్రమే ఉంది. సాధారణంగా సినిమాలో ఉన్న హైలైట్స్ అన్నింటిని ట్రైలర్ లో కట్ చేసి సినిమాకు హైప్ క్రియేట్ చేయడం రొటీన్ గా జరిగే విషయం. కానీ “గుంటూరు కారం”లో హైలైట్స్ ఏంటి అంటే… మహేష్ చెప్పిన వన్ లైనర్స్ అండ్ మేనరిజమ్స్ మాత్రమే!

ఒక సాధారణ కధను కూడా తన స్క్రీన్ ప్రజెన్స్ తో, డైలాగ్స్ తో ప్రేక్షకులను సమ్మోహితులను చేయడం మహేష్ కు వెన్నతో పెట్టిన విధ్య. దీంతో “గుంటూరు కారం” విజయావకాశాలు అంతా ప్రస్తుతం మహేష్ ఒక్కడి పైనే నిలిచాయి. “సర్కారు వారి పాట” వంటి ఒక సాధారణ కధ కూడా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ వసూళ్లు రాబట్టిందంటే అది మహేష్ కున్న స్క్రీన్ ప్రజెన్స్ విలువే. ఆ మాటకొస్తే ఒక్క “సర్కారు వారి పాట” మాత్రమే కాదు, బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయిన “1 నేనొక్కడినే” వంటి సినిమాలను కూడా క్లాసిక్స్ గా మార్చిన ఘనత మహేష్ సొంతం.

అలాంటి మహేష్ ‘కుర్చీ మడతపెట్టి’ పాటలో వేసిన స్టెప్పులతో ఊగిపోయిన అభిమానులకు ట్రైలర్ కావాల్సినంత ‘కిక్’ను ఇవ్వలేకపోయింది. కానీ సూపర్ స్టార్ ను చూపించిన తీరుకు మాత్రం ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రెండున్నర్ర నిముషాల ట్రైలర్ ను చూసి రెండున్నర్ర గంటల సినిమాను డిసైడ్ చేయడం సబబు కానప్పటికీ, ‘ఖలేజా’ సినిమా మాదిరి సిల్వర్ స్క్రీన్ పైన మరిన్ని సర్ ప్రైజ్ లు ఉంటాయేమోనన్న ఆశతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ గుంటూరులో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ రచ్చకు సిద్ధమవుతున్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

డీఎస్సీపై సీబీఐ విచారణ కావాలి.. కానీ ఈ కేసుల్లో వద్దా?

ఏపీ మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, వాటిపై సీబీఐ చేత విచారణ జరిపించాలంటూ రాష్ట్రంలో వైసీపీ చేసిన హడావుడి అందరూ…

3 minutes ago

President Murmu: Women to Help Make India Developed by 2047

President Droupadi Murmu inaugurated the National Saras Mela at Punnami Ghat in Vijayawada. She said…

14 minutes ago