
హీరోలకు ఉండే క్రేజ్ లను లెక్కించడానికి సినీ ఇండస్ట్రీ కొన్ని లెక్కలను పరిగణనలోకి తీసుకుంటుంది. అందులో ఒకటి… టీజర్లకు, ట్రైలర్స్ కు యూట్యూబ్ లో దక్కే క్లిక్స్. ఈ విభాగంలో అయితే నితిన్ అనుకున్న టార్గెట్ ను ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ నూటికి నూరు శాతం పూర్తి చేసారు. ఇటీవల విడుదల చేసిన ‘అ…ఆ…’ ధియేటిరికల్ ట్రైలర్ కు వీక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మళ్ళీ మళ్ళీ చూస్తున్న ఈ ట్రైలర్ యూ ట్యూబ్ లో 1 మిలియన్ (10 లక్షల) క్లిక్స్ ను అందుకుంది.
దీంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీలో ఉంది. ‘అ… ఆ…’ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ కు అద్దం పడుతున్న ఈ వైనంతో హీరో నితిన్ కూడా సంతోషంలో ఉన్నాడు. త్రివిక్రమ్ రేంజ్ కు ఇలాంటి రికార్డులు పెద్దగా పట్టించుకోకపోయినా, నితిన్ కు మాత్రం చాలా అరుదుగా దక్కే రికార్డు కావడంతో ‘అ…ఆ…’ అన్ని విధాల ఆనందకరమైన అనుభూతులను నితిన్ కు మిగిలుస్తున్నట్లుగా కనపడుతోంది.
Making films rooted in Telangana is not new for Srikanth Odela. Dasara was set in…
రాజకీయంలో ఒక్కోసారి సొంత పార్టీ గెలుపు కన్నా తన ప్రత్యర్థి పార్టీ ఓటమే కీలకంగా మారుతుంది. తమ పార్టీ గెలవకపోయిన…