
“జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త – ఈ బోర్డు రోడ్డు వేసే వరకు ఎవరైనా తొలగించినచో వారి వారి కుటుంబం ఈ రోడ్ల పైన పోతారు” అంటూ వైసీపీ రంగులతో జగన్ ఫోటోలు ముద్రించిన బ్యానర్ రోడ్డుకు అడ్డంగా ఉంచి తెలిపిన ఈ నిరసన, బహుశా సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం అవుతుందేమో!
గోదావరి జిల్లాలో వెలిసిన ఈ పోస్టర్ ‘గోదారోళ్ళ ఎటకారానికి నిదర్శనంగా నిలుస్తుందంటూ’ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ‘అంతేగా అంతేగా’ అనడం వీక్షించిన వారి వంతు! ఏపీలో రోడ్లు ఎంత దయనీయ పరిస్థితులలో ఉన్నాయో వర్ణించడం బహుశా గోదారోళ్ళకే బాగా వస్తుందేమో!
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…