
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో జాతీయపార్టీ స్థాపించి జాతీయ రాజకీయాలలో ప్రవేశించబోతున్నారు. ఇంతకాలంగా ఆయన పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దూరంగా ఉంటున్నప్పటికీ ఇప్పుడు ఏపీకి కూడా తన పార్టీని విస్తరించాల్సి ఉంటుంది. అందుకోసం ఏపీలో ఏదో ఓ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలి లేదా ఒంటరిగా అయినా పోటీ చేయవలసి ఉంటుంది. కనుక అటువంటి ఆలోచనతోనే మంత్రి హరీష్ రావు చేత కేసీఆర్ ఈవిదంగా మాట్లాడించారా? అని సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సందేహం వ్యక్తం చేసినట్లున్నారు.
ఏపీలో కేసీఆర్ పార్టీ ప్రవేశించడం ఖాయం. గత ఎన్నికలలో వైసీపీని గెలిపించేందుకు ఆయన తోడ్పడినప్పటికీ, ఆ తర్వాత వారి మద్య దూరం పెరిగింది. అయితే ఒకరినొకరు ద్వేషించుకొనే స్థాయిలో మాత్రం లేదనే చెప్పవచ్చు. కానీ ఏపీలో 175 సీట్లు వైసీపీయే గెలుచుకోవాలని జగన్ అనుకొంటున్నప్పుడు, కేసీఆర్ పార్టీకి రెడ్ కార్పెట్ పలికి స్వాగతం పలకరు.
ఇక టిడిపి, చంద్రబాబు నాయుడుతో కేసీఆర్కు ఎన్నడూ సఖ్యత లేదు. జనసేన పార్టీ ప్రస్తుతం బిజెపితో ఉంది. భవిష్యత్లో టిడిపితో చేతులు కలపవచ్చు. కనుక జనసేన కూడా కేసీఆర్ జాబితాలో ఉండదు. ఇక మిగిలిందల్లా వామపక్షాలే. తెలంగాణలో ఎలాగూ వామపక్షాలతో పొత్తులు పెట్టుకొన్నారు కనుక ఏపీలో కూడా వాటితోనే పొత్తులు పెట్టుకొని తెలంగాణ సరిహద్దులోని ఏపీ జిల్లాలో కేసీఆర్ పార్టీ పోటీ చేయవచ్చు.
Nani's recent release The Paradise carried a massive buzz ahead of its theatrical release. Unfortunately,…
కేంద్రంలో ప్రధాని మోదీని గద్దె దించడం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వల్లకాదని మూడుసార్లు నిరూపించబడింది. అలాగే ఏపీ…