
తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ వరకు కేసీఆర్ సాగించిన రాజకీయం ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేసింది, తెలంగాణలో టీడీపీ పార్టీని సమాధి చేసింది. నాడు పార్టీ పేరులో తెలంగాణ అనే పదాన్ని జోడిస్తూ కేసీఆర్ సాగించిన ప్రాంతీయవాద రాజకీయానికి ‘తెరాస’ ఒక ఆయుధంగా మారింది.
ఆ ఆయుధం తో కేసీఆర్ దశాబ్దాల పాటు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వచ్చారు. అయితే 2018 ఎన్నికలకు ముందు తెరాస పేరును బిఆర్ఎస్ గా మారుస్తూ కేసీఆర్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం కేసీఆర్ రాజకీయ భవిష్యత్ ని తెరాస గత చరిత్రను ఒక్కసారిగా చీకటిలోకి నెట్టేసింది.
కేసీఆర్ వదిలేసినా ఆ తెరాస (తెలంగాణ రాష్ట్ర సమితి) ఇప్పుడు కవిత తెరాస (తెలంగాణ రక్షణ సేన) గా మారి కేసీఆర్ ప్రాంతీయవాద రాజకీయానికి చెక్ పెట్టనుంది, అలాగే బిఆర్ఎస్ సాగించే రాజకీయానికి సవాల్ గా మారనుంది.
తెరాస తో రాజకీయంగా ఒక్కో మెట్టు ఎదిగిన కేసీఆర్ ను అదే తెరాస తో ఒక్కో మెట్టు కిందకు దించేందుకు కవిత సిద్ధమయ్యారు అనే సంకేతాలు ఆమె తన పార్టీ ప్రకటన రోజే పరోక్షంగా వెల్లడించారు. కేసీఆర్ ని మారిన మనిషి అని మర మనిషి అంటూ తండ్రి పై చాల ఘాటైన రాజకీయ విమర్శలతో రెచ్చిపోయారు కవిత.
అయినా అటు కేసీఆర్ నుంచి కానీ ఇటు కేటీఆర్, హరీష్ ల నుంచి కానీ బిఆర్ఎస్ నుంచి కానీ కవిత పై అదే స్థాయిలో కౌంటర్ లు రాలేకపోయాయి. తెరాస పేరు తో నాడు కేసీఆర్ సాగించిన రాజకీయానికి అదే తెరాస పేరుతో నేడు కవిత చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు.
ఇంటి ఆడపడుచు పై నోరెత్తలేక బిఆర్ఎస్ మౌనంగా కవిత విమర్శలను, ఆరోపణలను మోస్తుంది. అలాగే కవిత తెరాస పేరు పై దూకుడుగా విమర్శలు చేసేందుకు కూడా బిఆర్ఎస్ శ్రేణులు వెనకడుగు వేస్తున్నారు.
అంటే తెరాస పేరు తెలంగాణ రాజకీయాలలో ఎంత కీలకంగా మారిందో, మారుతుందో కవిత ముందుగానే ఉహించి తన భవిష్యత్ రాజకీయానికి భద్రతగా పార్టీ పేరును తెరాస గా ఎంచుకున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఏదిఏమైనా మొత్తానికి నాడు కేసీఆర్ చేతిలో ఆయుధంగా ఉన్న తెరాస నేడు అదే కేసీఆర్ పాలిట అస్త్రంగా మారబోతుందన్న మాట వాస్తవం.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam AK 47 was expected to arrive on October 9 after missing its…
Sanjay Dutt faced severe criticism after a recent appearance on Shekhar Suman’s show. His comments…