
The Trump-Iran conflict has intensified concerns over Gulf stability, oil prices and the potential impact on the global economy.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను పది రోజులలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపించేయగాలని గొప్పగా చెప్పుకున్నారు. ఏడాది కావస్తున్నావాటి యుద్ధాన్ని ఆపించలేకపోగా, ‘వీకెండ్ పిక్నిక్’ అంటూ తాను స్వయంగా మొదలుపెట్టిన ఇరాన్‌తో యుద్ధం కూడా ఆపలేకపోతున్నారు.
ఇప్పుడీ యుద్ధం క్రమంగా గల్ఫ్ దేశాలన్నిటికీ విస్తరిస్తోంది. అమెరికా-ఇరాన్ యుద్ధంతోనే చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు గల్ఫ్ దేశాలకు ఈ యుద్ధం విస్తరిస్తే చమురు సంక్షోభం మరింత పెరుగుతుంది.
అమెరికా ఆర్ధికంగా చాలా బలమైన దేశమే కావచ్చు. కనుక ఇప్పటికే ఈ యుద్ధం కోసం లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఈ యుద్ధం ఇంకా ఎన్ని నెలలు, ఏళ్ళు కొనసాగుతుందో ట్రంప్‌కి కూడా తెలీదు. కనుక ఇంకా ఎంత ఖర్చు చేయాలో ఎవరికీ తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. అమెరికన్ల కష్టార్జితాన్ని ట్రంప్ ఏట్లో పిసికిన చింతపండులా వృధా చేస్తున్నారని చెప్పక తప్పదు.
ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా ఏవిధంగా తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందో, ఒకవేళ ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంటే అమెరికా కూడా అలాగే ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది.
భారత్‌తో సహా అనేక దేశాలు ఎగుమతులు, ఉద్యోగాలు, ఐటి సేవల కోసం అమెరికాపై ఆధారపడి ఉన్నాయి. కనుక ఈ యుద్ధం వలన అమెరికా ఆర్ధిక వ్యవస్థ దెబ్బ తింటే, ఆ ప్రభావం ప్రపంచదేశాలపై కూడా పడుతుంది.
సగటు అమెరికన్ల జీవితం సజావుగా సాగుతున్నంత కాలం వారు కూడా ఈ యుద్ధం గురించి పట్టించుకోకపోవచ్చు. కానీ ఒడిదుడుకులు ప్రారంభమైతే అప్పుడు వారు కూడా ట్రంప్‌ని వ్యతిరేకించడం ఖాయం.
ఇవన్నీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కి తెలియవని అనుకోలేము. కానీ ట్రంప్ తన పంతానికి తన దేశాన్ని, ఇరాన్‌తో సహా గల్ఫ్ దేశాలను, యావత్ ప్రపంచ దేశాలను కూడా ఆర్ధిక సంక్షోభంలోకి నెడుతున్నారు.
‘అమెరికా ఫస్ట్’ అనే నినాదంతో ట్రంప్ అధికారంలోకి వచ్చారు. కానీ అయన దిగిపోయే నాటికి అన్నివిధాలుగా ‘అమెరికా లాస్ట్’ అనే దుస్థితి ఏర్పడుతుందేమో?
India beat Afghanistan by 7 wickets in the second T20I in Delhi to take an…
With Rohith and Trigun emerging as the potential gamers in the Bigg Boss reality show,…