Telugu

రాత్రికి రాత్రి మార్పు సాధ్యం కాదు దొరా!

హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్‌ మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారు. మొదట ఇది వార్షిక ఫీజని ప్రకటించిన ట్రంప్‌, ఇప్పుడది వన్-టైమ్‌ ఫీజు మాత్రమేనంటూ ఓ మెట్టు దిగారు. ఇది కొత్తగా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారికే తప్ప రెన్యువల్స్‌కి వర్తించదని మరో మెట్టు దిగారు.

ఇప్పుడు అమెరికాలో కీలకరంగాలలో పనిచేస్తున్న వారికి కూడా ఇది వర్తించదని సూచనప్రాయంగా తెలియజేశారు. వైద్య, ఆరోగ్యం, సైబర్ సెక్యూరిటీ, ఇందన, రక్షణ, జాతీయ భద్రత, పౌరవిమానయాన తదితర రంగాలలో పనిచేస్తున్నవారికి ఈ లక్ష డాలర్ల ఫీజ్ నుంచి మినహాయింపు ఉండవచ్చని తాజా సమాచారం.

ADVERTISEMENT

అమెరికా అధ్యక్షుడు మాటే యావత్ ప్రపంచానికి శాసనం వంటిది. అంత శక్తివంతుడైన వ్యక్తి సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కి సవరణలు చేసుకోవలసి రావడం సిగ్గుచేటే కదా?

లేడికి లేచిందే ప్రయాణం అన్నట్లు ట్రంప్‌ ఆవేశంతోనో అనాలోచితంగానో తీసుకుంటున్న ఇటువంటి నిర్ణయాల వలన అమెరికాలో ఆయా రంగాలపై తీవ్ర ప్రభావం పడుతుందనే హెచ్చరికలతో వెనక్కు తగ్గక తప్పడం లేదు.

కానీ ట్రంప్‌ వైఖరిని మరో కోణంలో చూస్తే అమెరికాకు అవసరమనుకున్నవారిని ఉంచుకుంటారు అవసరం తీరిపోతే నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకొని బయటకు గెంటేయడానికి వెనకాడరని నిరూపించుకున్నారు.

ఏ దేశ ప్రధాని, దేశాధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా తన దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు మేలు కలగాలని కోరుకుంటారు. ట్రంప్‌ కూడా అలాగే కోరుకుంటున్నారు. కానీ రాత్రికి రాత్రే మార్పు అసాధ్యమని గ్రహించక ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

సౌదీ అరేబియాతో సహా గల్ఫ్ దేశాలలో జనాభా, నిరుద్యోగ సమస్య క్రమంగా పెరుగుతున్నట్లు గుర్తించగానే ఆయా ప్రభుత్వాలు ముందుగా యువతని ట్రైనీలుగా తీసుకొని వారికి శిక్షణ ఇస్తూ మెల్లగా విదేశీయులను తిప్పి పంపిస్తున్నాయి.

ఇప్పుడు గల్ఫ్ దేశాలలో అన్ని రంగాలలో అరబ్బీలే ఉన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి దాదాపు రెండుమూడు దశాబ్దాలు పట్టింది. కానీ ట్రంప్‌ రాత్రికి రాత్రే అంతా మార్చేయాలనుకొని బోర్లాపడి నవ్వులపాలవుతున్నారు. మంచి పాలన అంటే దీర్ఘకాలిక దృష్టితో క్రమబద్ధమైన నిర్ణయాలు. అయితే ట్రంప్‌ ఒక్కరితో సాధ్యపడేది కాదు కనుక ఆయన తర్వాత వచ్చే పాలకులు కూడా ఈవిదంగా ముందుకు సాగితే మరో 5-10 ఏళ్ళలో ఆశించిన ఈ మార్పు తప్పక వస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

వైసీపీ బీసీ గర్జన… వై ఉత్తరాంధ్ర.?

స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల…

16 minutes ago

Shocking Navratri Trend: IV Drips for Gen Z Wild Nights

Ahmedabad’s Navratri celebrations are known for late nights, hours of energetic Garba and elaborate outfits,…

31 minutes ago