
ఉక్రెయిన్‌పై రష్యా 2022, ఫిబ్రవరి 24న దండెత్తింది. దానిని నల్లిని నలిపినట్లు నలిపేయవచ్చనుకున్నారు పుతిన్. మహా అయితే వారం రోజుల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తన కాళ్ళ మీద పడి శరణు వేడుకుంటాడనుకున్నారు. అప్పుడు ఉక్రెయిన్‌లో తనకు కావాల్సిన ముక్కలన్నీ తీసుకొని ఉదారంగా క్షమించవచ్చని పుతిన్ అనుకున్నారు.
కానీ నేటికీ ఉక్రెయిన్నీ… దాని అధ్యక్షుడు జెలెన్ స్కీని లొంగదీసుకోలేకపోయారు. పైగా ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలుపెట్టాక రష్యా ఆర్ధిక పరిస్థితి తారుమారు అయ్యింది. సగం ధరకు ఆయిల్ అమ్ముకుంటే తప్ప రోజు గడవని దుస్థితి దాపురించింది.
సరిగ్గా ఇలాంటి సమయంలో అంటే 2025, జనవరి 25న ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యారు. తన ఎడమ చిటికెన వేలితో సైగ చేసి పది రోజుల్లో యుద్ధం ఆపేయగలనని చెప్పారు. ఏడాది గడిచిపోతోంది. కానీ నేటికీ ఆపలేకపోయారు. యుద్ధం విషయంలో పుతిన్ లెక్కలు తప్పాయి కనీ ట్రంప్‌వి కావు.
ఓసారి ఆయన పుతిన్ని చంకనెక్కించుకుంటారు, మరోసారి జెలెన్ స్కీని ఎక్కించుకుంటారు. ఓసారి యుద్ధం ఆపేశాను నోబుల్ శాంతి బహుమతి నాకే ఇవ్వాలంటారు. మరోసారి శాంతి చర్చలు ఇంకా కొనసాగుతున్నాయంటారు.
ఈ యుద్ధం ఆపకపోతే నాటో ద్వారా ఉక్రెయిన్ ఆయుధాలు (సేల్) అందిస్తామంటారు. మద్యలో రష్యా చమురు-భారత్‌పై వాణిజ్య సుంకాలు అంటారు. ఆ పేరుతో భారత్‌కు రూ.836 వందల కోట్ల విలువగల ఆయుధాలు అమ్ముకున్నారు మన శాంతి కామకుడు ట్రంప్! అంటే నోబుల్ బహుమతి ఎంత ముఖ్యమో యుద్ధం జరగడం కూడా అంతే ముఖ్యమన్న మాట!
ఇలా యుద్ధం, శాంతి చర్చలు, ఆయుధాల వ్యాపారం సాగుతుండగానే అప్పుడే ఏడాది గడిచిపోయింది! బహుశః ఎవరూ ఇది గమనించి ఉండరు.
కనుక ట్రంప్ మళ్ళీ జెలెన్ స్కీని వైట్‌హౌస్‌కి పిలిచి యుద్ధ విరమణకు 28 పాయింట్ ఫార్ములా గురించి డిస్కస్ చేశారు. కానీ జెలెన్ స్కీ వాటికి ఒప్పుకోలేదని పుకార్లు వినిపిస్తున్నాయి.
కనుక ట్రంప్‌కి మళ్ళీ ఆయన మీద కోపం రావచ్చు… మళ్ళీ వార్నింగ్ ఇవ్వచ్చు,.. ఆంక్షలు విధించవచ్చు లేదా మరో నాలుగైదు సమావేశాలు లాగించేయవచ్చు.
ఈలోగా రష్యా-ఉక్రేయింగ్ యుద్ధం యధాతధంగా కొనసాగుతూనే ఉంటుంది. దాని వలన యూరోప్ దేశాలకు కూడా ప్రమాదం పొంచి ఉంది. కనుక వాటికీ అవసరమైన ఆయుధాలు ‘డిస్కౌంట్ ధరల్లో’ ట్రంప్ సప్లై చేయాల్సి రావచ్చు. దానిని ఆయుధాల వ్యాపారంగా కార్యక్రమంలో యుద్ధం ఆపేందుకు చేస్తున్న యుద్ధమే అని సరిపెట్టుకోవాలి.
అందరూ చూస్తూ చూస్తూ ఉండగానే ట్రంప్ పదవీకాలం పూర్తయిపోవచ్చు. రూల్ ప్రకారం మళ్ళీ ఆయన అమెరికా అధ్యక్షుడు కాలేరు. కానీ ఈ 4 ఏళ్ళలో ‘యుద్ధాలు ఆపడం ఎలా?’ అనే అంశంపై మంచి పట్టు, అనుభవం సంపాదించారు.
కనుక వాటి కోసం ‘గ్లోబల్ కన్సల్టేన్సీ సంస్థ’ను పెట్టుకొని ఆయా దేశాల వద్ద ఫీజ్ తీసుకొని మద్య శాంతి చర్చలు కండక్ట్ చేయవచ్చు. వినని వాటికి యుద్ధాలు చేయడానికి ఆయుధాలు అవసరం. కనుక సొంతంగా ఓ ఆయుధాల కంపెనీ పెట్టుకొని వాటికి అమ్ముకుంటూ శేషజీవితం హాయిగా గడిపేయవచ్చు.
For the first time in Bigg Boss history, there is a double eviction in the…
Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…