
అగ్రరాజ్య అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు తన విధానాలతో, నిర్ణయాలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారు. నా అధ్యక్షతన ఎన్నో యుద్దాలు ఆపాను అంటూ శాంతి దూతలా ఒక పక్క ప్రచారం చేసుకుంటూ అందుకు తనకు నోబెల్ బహుమతి ప్రధానం చెయ్యాలంటూ డిమాండ్ చేస్తూనే,
మరోపక్క ఇతర దేశాల మీద రాజకీయ ఆధిపత్యం సాగించడానికి ఆయా దేశపు అధ్యక్షులను అరెస్టులు చేయడం, లేదా ఇతర దేశాల మీద యుద్ధాలకు వెళ్లడం ట్రంప్ ద్వంద్వ రాజకీయ నీతికి నిదర్శనంగా నిలుస్తుంది. అలాగే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ప్రపంచంలోని అన్ని దేశాల మీద ట్రంప్ టారీఫ్ల మోత మోగించారు.
చైనా, కెనడా, బ్రెజిల్, బర్మా, వియాత్నం, లావోస్, స్విట్డర్లాండ్ తో సహా భారత్ పై కూడా ట్రంప్ టారీఫ్ల భారం వేశారు. ఒక పక్క అమెరికా న్యాయస్థానం ట్రంప్ టారీఫ్లను వ్యతిరేకించినా ట్రంప్ మాత్రం తగ్గేదెలా అంటూ ఒక్కో దేశం పై 100% నుంచి 50, 40, 30, 18% అంటూ ఇలా నోటికి వచ్చిన నెంబర్లను టారిఫ్ లుగా విధించుకుంటూ పోయారు.
అలాగే ఈ టారిఫ్ ల వలన అమెరికాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుందని, తద్వారా అమెరికా పురోగతికి బాటలు పడనున్నాయంటూ తన టారిఫ్ ల మోతను సమర్ధించుకున్న ట్రంప్ ఇప్పుడు ఆ దండుకున్న సంపాదన మొత్తాన్ని ఇరాన్ యుద్దానికి తగలేస్తున్నారని ఇంటా బయటా విమర్శలు ఎదుర్కుంటున్నారు.
ఇరాన్ తో యుద్ధం అంటూ ఇజ్రాయిల్ తో కలిసి అమెరికా సాగిస్తున్న ఈ పోరులో అమెరికా ఇప్పటికే సుమారు 2.5 లక్షల కోట్లు ఖర్చు చేసినట్టు ఇంటర్ నేషనల్ మీడియాలో పలువార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇరాన్ పై ట్రంప్ చేస్తున్న హెచ్చరికలన్నీ మేకపోతు గాంభీర్యాలే అంటూ,
ఆ గాంభీర్యాల ప్రదర్శనకు యుద్ధం పేరుతో 21 రోజులలో 27 బిలియన్ల డాలర్లు అమెరికా సొమ్మును ఖర్చు చేసారని, ఇప్పుడు మరో 200 బిలియన్లకు గాను పార్లమెంట్ లో ట్రంప్ రిక్వెస్ట్ పెట్టేందుకు సిద్దమయ్యారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. దీనితో ఇక రానున్న రోజులలో ఈ యుద్ధ ప్రభావంతో అటు ఇరాన్, ఇజ్రాయిల్ తో పాటుగా ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా వంటి అగ్రరాజ్యం సైతం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లడం ఖాయంటున్నారు ఆర్థిక నిపుణులు.
ఇప్పటికే ట్రంప్ టారీఫ్ల దెబ్బకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాలతో అల్లాడుతుంటే ఇక ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం ఎఫెక్ట్ మార్కెట్లలో వరుస బ్లడ్ బాత్ లను సృష్టించుకుంటూ నానాటికి పతనమవుతున్నాయి. ఇందుకు అమెరికా మినహాయింపు అనే ప్రస్తావనే లేకుండా సంచి లాభం చిల్లు పోగొట్టినట్టుగా ట్రంప్ టారీఫ్లతో అమెరికాకు వచ్చిన ఆదాయం ఈ ఇరాన్ యుద్ధం దెబ్బకు పూర్తిగా ఆవిరైపోయిందంటూ ట్రంప్ ఒంటెద్దు పోకడలను అమెరికా తో సహా ప్రపంచం ఈసడించుకుంటుంది.
Crazy Kalyanam is moving ahead of its theatrical release by arriving earlier than originally planned.…
There is a different side of Teja Sajja to be seen in The Traitors Telugu.…