Telugu

ట్రంప్‌ హెచ్-1బీ రాగానికి మద్దెల దరువు… భలే ఉంది!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించిన 24 గంటలలోనే యూటర్న్ తీసుకున్నారు.

వైట్‌హౌస్‌లో ఆయన సమక్షంలోనే కామర్స్ సెక్రెటరీ హోవార్డ్ లుట్నిక్ హెచ్-1బీ వీసా ఫీజు ఏడాదికి లక్ష డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

ADVERTISEMENT

అమెరికన్ లేదా అమెరికాలో ఇతర దేశాల కంపెనీలు తమ ఉద్యోగులు అంత విలువైనవారని భావిస్తే తప్పకుండా ఏడాదికి లక్ష డాలర్లు వీసా ఫీజ్ చెల్లించి వారి సేవలను కొనసాగించవచ్చన్నారు.

ఒకవేళ వారిపై అంత విలువైనవారు కారని భావిస్తే వారి స్థానాలలో అమెరికన్లను యమించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు.

కనుక ట్రంప్‌కి ఈ విషయం తెలియకుండానే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారనుకోలేము. ట్రంప్‌ సంతకం చేసిన ఆ ఆర్డర్‌లో కూడా ‘వార్షిక ఫీజ్ లక్ష డాలర్లు’ అనే ఉంటుంది కదా?

కానీ ట్రంప్‌ నిర్ణయంపై అమెరికాలోని వివిధ దేశాల కంపెనీలతో పాటు ఆమెరికన్ కంపెనీలు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ ఒత్తిళ్ళకు తలొగ్గి ట్రంప్‌ దీనిపై 24 గంటలలోనే యూటర్న్ తీసుకున్నారు.

వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్ లీవిట్‌ దీనిపై వివరణ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దాని ప్రకారం..

1. లక్ష డాలర్లు వార్షిక ఫీజు కాదు. దరఖాస్తు చేసుకున్నప్పుడు ఓకే ఒక్కసారి చెల్లిస్తే చాలు.

2. హెచ్-1బీ వీసాల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారికి మాత్రమే లక్ష డాలర్ల ఫీజ్ వర్తిస్తుంది.

3. హెచ్-1బీ వీసాల రెన్యువల్ చేయించుకునే వారికి ఇది వర్తించదు.

4. ఈసారి హెచ్-1బీ వీసాలకు లాటరీలో ఎంపికైనవారు లక్ష డాలర్లు వీసా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

5. ఇప్పటికే హెచ్-1బీ వీసాలు కలిగి విదేశాలలో పనిచేస్తున్నవారికి ఇది వర్తించదు. వారు స్వదేశానికి తిరిగి వచ్చినప్పుడు ఎటువంటి ఛార్జీలు విధించబడవు. ఆ వీసాలతో వారు అమెరికా నుండి విదేశాలకు రాకపోకలు సాగించవచ్చు.

ట్రంప్‌ ఇన్ని ప్రగల్భాలు పలికి 24 గంటలలోనే దీనిపై యూటర్న్ తీసుకోవడంపై అమెరికన్ పౌరులు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రంప్‌ని విమర్శిస్తూ, ఎద్దేవా చేస్తూ పోస్టులు పెడుతున్నారు. విదేశీయులను పంపించేస్తానని, అమెరికన్లను ఉద్దరిస్తానని చెప్పి ట్రంప్‌ ఇప్పుడు వారికే దాసోహం అయ్యారని విమర్శిస్తున్నారు.

హెచ్-1బీ వీసా ఫీజు విషయంలో తన నిర్ణయం అమెరికన్ పౌరులకు, అమెరికా ఆర్ధిక వ్యవస్థకి ఎంతో మేలు చేస్తుందని ట్రంప్‌ గొప్పగా చెప్పుకున్నారు. అందుకు అమెరికన్ పౌరులు మెచ్చుకున్నారు కూడా. కానీ ఇప్పుడు వారే ట్రంప్‌ని తిట్టిపోస్తున్నారు.

అమెరికాకు ఏటా సుమారు 50-60 వేల హెచ్-1బీ వీసాల కోసం కొత్త దరఖాస్తులు వస్తుంటాయి. ఇప్పుడు ఒక్కో వీసా కోసం వన్-టైమ్‌ ఫీజుగా లక్ష డాలర్లు చెల్లించడం అసాధ్యమని అమెరికాలో కంపెనీలు వాదిస్తున్నాయి.

లక్ష డాలర్లు చెల్లించిన తర్వాత ఆ ఉద్యోగిని ఉద్యోగంలో నుంచి తొలగించాల్సి వచ్చినా లేదా అ ఉద్యోగి రాజీనామా చేసినా తాము చెల్లించిన లక్ష డాలర్లు ఎవరు తిరిగి ఇస్తారని ప్రశ్నిస్తున్నాయి.

కనుక ట్రంప్‌ ప్రభుత్వం ఈ ఒత్తిళ్ళు భరించలేక మళ్ళీ లక్ష డాలర్ల ఫీజును 50, 25 లేదా 10 వేలకు తగ్గించినా మళ్ళీ విమర్శలు తప్పవు. కనుక ట్రంప్‌ పరిస్థితి రెండు వైపులా మద్దెల దరువులా మారింది. ఇది స్వయంకృతమే కనుక ఇప్పుడు ట్రంప్‌ కూడా తనని తాను నిందించుకోక తప్పదు. ఇది ఇంకా బాధాకరం!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Is Ethan Hunt Bigger Than Tom Cruise?

Tom Cruise can still make audiences run to theatres, but it seems they need a…

3 minutes ago

వైసీపీ బీసీ గర్జన… వై ఉత్తరాంధ్ర.?

స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల…

17 minutes ago