Telugu

నాడు ఏపీలో… నేడు అమెరికాలో కంపెనీలు…

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ నిర్ణయాలు, విధానాలతో అమెరికా లాభాపడుతుందా? అంటే అవుననే అంటున్నారు ట్రంప్‌. సుంకాలు, విదేశీ విద్యార్ధులపై ఆంక్షలతో ప్రపంచ దేశాలపై విరుచుకు పడిన ట్రంప్‌ తాజాగా హెచ్1 బీ వీసాలపై కొరడా ఝళిపించారు.

ఇక నుంచి ఈ వీసాల ఫీజు ఏడాదికి లక్ష డాలర్లుగా ఖరారు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్‌ సంతకం చేశారు. ఏడాదికి లక్ష డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.88 లక్షలు.

ADVERTISEMENT

అమెరికన్ కంపెనీలలో, అమెరికాలోని భారతీయ కంపెనీలలో ఈ వీసాలపై వచ్చి పని చేస్తున్నవారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఇంతకాలం ఈ వీసా ఫీజుల భారం సదరు కంపెనీలే భరిస్తున్నాయి.

ఇప్పుడు ట్రంప్‌ నిర్ణయంతో వాటన్నిటి పై తీవ్ర ప్రభావము పడుతుంది. కనుక వాటి ముందు 3 మార్గాలు కనిపిస్తున్నాయి.

1. ట్రంప్‌ చెప్పినట్లు విదేశీ ఉద్యోగులందరినీ ఉద్యోగాలలో నుంచి తొలగించేసి, అమెరికన్లను నియమించుకోవడం. తద్వారా హెచ్1 బీ వీసాల బాదుడు తప్పించుకోవచ్చు. కానీ తక్కువ జీతాలకు పనిచేసే విదేశీ ఉద్యోగుల వీసా ఫీజులకు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువా?అమెరికన్లను పదిరెట్లు ఎక్కువ జీతం ఇచ్చి ఉద్యోగాలలో నియమించుకోవడం వలన ఎక్కువ భారం ఉంటుందా? అని లెక్కలు కట్టుకోవాల్సి ఉంటుంది.

2. ఒక్కో కంపెనీ తమ ఉద్యోగుల వీసాల కోసం లక్షల కోట్ల డాలర్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కనుక ఆ భారం పూర్తిగా లేదా పాక్షికంగా తమ ఉద్యోగులపై వేయవచ్చు. కానీ అంతిమంగా ఈ భారాన్ని తమ ఉత్పత్తులు, సేవలు పొందుతున్న అమెరికన్లకి బదిలీ చేయక మానవు.

3. అమెరికాలో తమ కార్యకలాపాలు గణనీయంగా తగ్గించుకొని ఆ మేరకు భారత్‌, చైనా, తైవాన్, దక్షిణ కొరియా తదితర దేశాలలో భారీగా కార్యకలాపాలు పెంచుకోవడం.

అమెరికాలో కంపెనీలు ఇంతేసి వీసా ఫీజులు చెల్లించడం అసంభవం. చెల్లిస్తే అదే వాటి లాభాలను మింగేస్తుంది. కనుక ముందుగా ఉద్యోగులను తగ్గించుకుని కొంత భారం తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు.

ప్రభుత్వం నిర్ణయాలు, విధానాలు పరిశ్రమలకు, ఐటి కంపెనీలకు ఇబ్బందికరంగా మారితే ఏం జరుగుతుందో ఇది వరకు ఆంధ్రప్రదేశ్‌లో చూశాము. కనుక ఇప్పుడు ట్రంప్‌ దెబ్బకు అమెరికాలో కూడా అలాగే జరుగుతుందేమో?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Is Ethan Hunt Bigger Than Tom Cruise?

Tom Cruise can still make audiences run to theatres, but it seems they need a…

3 minutes ago

వైసీపీ బీసీ గర్జన… వై ఉత్తరాంధ్ర.?

స్థానిక సంస్థల ఎన్నికల కోసం టీడీపీ ప్రభుత్వం బీసీలకు 34% రిజర్వేషన్ అంశాన్ని తెరమీదకు తెచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల…

17 minutes ago