ట్రంప్‌గారు… ఏంకోల్పోయారో చూశారా?

భారత్‌పై 50 శాతం పన్నులు విధించి అదేదోఘనకార్యమన్నట్లు ట్రంప్‌ మాట్లాడారు. పైగా అసలు విషయం చెప్పకుండా రష్యా నుంచిచమురు కొనుగోలు చేస్తున్నందుకే ఈ శిక్ష… అమెరికాకు భారత్‌ లొంగి తీరాల్సిందే అన్నట్లుబెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. కానీ ఈ అహంభావం, ఈ మొండితనమే అమెరికాకు ఒక అతి పెద్ద వ్యాపారావకాశాన్ని కోల్పోయేలా కూడా చేసింది.

ఫ్రాన్స్‌ దేశానికిచెందినా డసాల్ట్‌ కంపెనీ నుంచి భారత్‌ ఇప్పటికే 36 రాఫెల్ జెట్ విమానాలు కొనుగోలు చేసింది. వీటి విలువ కొన్ని వేలకోట్లు! ఇప్పుడు మరో 176 రాఫెల్‌ జెట్స్ కొనుగోలుకి సిద్దమవుతోంది! ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు! ట్రంప్‌దుందుడుకుతనం, అహంభావం వలన అమెరిక ఇంత పెద్ద బిజినెస్ కోల్పోయింది.

ADVERTISEMENT

ట్రంప్‌ సుంకాలవలన భారత్‌కు సుమారు 4 లక్షల కోట్లు నష్టం కలుగుతుందని ఆర్ధిక నిపుణులు అంచనావేశారు. కానీ ఈ ఒకే ఒక్క కాంట్రాక్టుతో అమెరికా దానిలో సగం పోగొట్టుకుంది కదా?
భారత్‌ ఇదివరకు అమెరికానుంచి వేల కోట్లతో డ్రోన్లు వగైరా రక్షణ సామాగ్రి కొనుగోలు చేసింది. కనుక ఒకవేళ ట్రంప్‌ భారత్‌పై ఈ స్థాయిలో పన్నులువిధించకుండా కొద్దిగా పెంచి, మునుపటిలా స్నేహ పూర్వకంగా వ్యవహరించి ఉండి ఉంటే, కనీసం 50-60 వేలకోట్ల బిజినెస్ దక్కి ఉండేది. కానీ ట్రంప్‌ అహంభావంతో వ్యవహరిస్తూ అదీపోగొట్టుకున్నారు.

ఇక ఈ కాంట్రాక్టులో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ అత్యాధునిక రఫెల్ ఫైటర్ జట్లన్నీ భారత్‌లోనే తయారుచేయబోతున్నారు! డసాల్ట్ సంస్థ భారత్‌లోనేవీటి నిర్వహణ (మెయింటేనెన్స్) సేవలు కూడా అందించబోతోంది.

అంటే ఇది ఒకటి రెండు సంవత్సరాల బిజినెస్ ఏమాత్రం కాదు… కొన్ని దశాబ్దాలపాటు సాగబోతున్న బిజినెస్ అనిస్పష్టమవుతోంది. ట్రంప్‌ అహంభావం వలన అమెరికా కంపెనీలు ఈ అద్భుతమైన వ్యాపార అవకాశంపోగొట్టుకున్నాయి.

మరో కీలకమైన విషయంఏమిటంటే, అమెరికా ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు సరితూగే రఫెల్ ఫైటర్ జెట్స్ సాంకేతికపరిజ్ఞానం భారతీయ శాస్త్రవేత్తలకు, ఇంజనీరింగ్ నిపుణుల చేతికి లభించబోతోంది!
నాడు రష్యా నుంచి ఇస్రోకిక్రయోజెనిక్ ఇంజన్లు, వాటి సాంకేతిక పరిజ్ఞానం అందకుండా అమెరికా అడ్డుపడింది. దానినిసవాలుగా తీసుకొని ఇస్రో శాస్త్రవేత్తలు దేశీయ పరిజ్ఞానంతోనే సొంతంగా క్రయోజెనిక్ ఇంజన్లు తయారుచేశారు. ఇప్పుడు రఫెల్ ఫైటర్ జెట్స్ సాంకేతిక పరిజ్ఞానం కూడా భారతీయ శాస్త్రవేత్తల చేతికి అందబోతోంది. దీనికీ ట్రంప్‌ కారకుడు కారా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Itllu Arjuna: Yellow Chunni Song Released

Aniesh made a good impression with his performance in the songs and teaser of Itllu…

39 minutes ago

Is Ethan Hunt Bigger Than Tom Cruise?

Tom Cruise can still make audiences run to theatres, but it seems they need a…

59 minutes ago