Telugu

టీటీడీ నోటీసులతో వైసీపీ గురువు ఇబ్బంది

‘విశాఖ శారదా పీఠం’…ఆధ్యాత్మికత కంటే రాజకీయాలతోనే ఈ పేరు ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ ఆస్థాన గురువు గా, జగన్ శ్రేయోభిలాషిగా ప్రసిద్ధి చెందారు శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్రులు.

వైసీపీ స్వామి భక్తికి, శారద పీఠం రాజభక్తికి అనుబంధంగా గత వైసీపీ హయాంలో ఈ శారద పీఠానికి అనేక భూముల కేటాయింపులు జరిగాయి. అటు విశాఖలోను ఇటు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి ఏడుకొండల మీద కూడా ఈ శారద పీఠానికి వేల కోట్ల విలువైన భూములను వైసీపీ దారాదత్తం చేసిన వైనాలు వెలుగులోకొచ్చాయి.

ADVERTISEMENT

అయితే ఇవన్నీ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం కట్టపెట్టిన భూములే కావడంతో కూటమి ప్రభుత్వం తిరిగి వాటిని స్వాధీనం చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు తిరుమల కొండ పై శారద పీఠాధిపతులు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల పై కూడా చర్యలు తప్పలేదు.

ఆ నిర్మాణాలు శ్రీవారి ఆలయం కంటే ఎత్తుగా నిర్మించేందుకు స్వరూపానంద ప్రణాళికలు రూపొందించారు. ఈ నేపథ్యంలో టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా తిరుమల కొండ మీద అక్రమ నిర్మాణాలు చేపట్టిన శారద పీఠం పై హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు కోర్టుకెళ్లాయి.

దీనితో విచారణ చేపట్టిన న్యాయస్థానాలు టీటీడీ కి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో టీటీడీ ఈ శారద పీఠాధిపతులకు నోటీసులు జారీ చేసింది. 15 రోజులలోపు తిరుమలలోని విశాఖ శారద పీఠం ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలను పూర్తి గా ఖాళీ చేసి టీటీడీ కి అప్పగించాలంటూ టీటీడీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ చర్యలతో గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి పుణ్య క్షేత్రంలో జరిగిన కొన్ని అవకతవకలకు న్యాయస్థానాలు చెక్ పెట్టినట్టయ్యింది. అయితే కోర్ట్ తీర్పు పై కానీ టీటీడీ ఆదేశాల పై కానీ అటు శారద పీఠం నిర్వాహకుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. వైసీపీ ఓటమితో స్వరూపానంద స్వామి వారు కూడా ఒక రకంగా వైసీపీ నాయకుల మాదిరి అజ్ఞాతంలో జీవిస్తున్నారనే చెప్పాలి.

మరి టీటీడీ తీసుకున్నఈ నిర్ణయాల పట్ల అటు అనుమతులు మంజూరు చేసిన గత టీటీడీ పాలకులు కానీ, గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు కానీ ఇప్పటి వరకు దీని పై వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా చెయ్యలేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

December 4 Clash: Nithiin vs Naga Chaitanya

Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…

14 minutes ago

First Direction, Next Acting? Jason Sanjay in the Spotlight

Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…

43 minutes ago