Telugu

కాంగ్రెస్ పార్టీ – వైస్ కుటుంబ..తులాభారంలో “తులసి” రెడ్డి!

కాంగ్రెస్ పార్టీ పై వైకాపా నేతల విమర్శలకు తన ప్రశ్నలతో చెక్ పెట్టారు కాంగ్రెస్ పార్టీ కడప సీనియర్ నేత తులసిరెడ్డి. కాంగ్రెస్ పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న వైస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం ఆయన కుటుంబాన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో ఇబ్బందులకు గురిచేసిందంటూ తప్పుడు ప్రచారంతో ప్రజలలో సానుభూతిని పొంది దశాబ్ద కాలంగా వైసీపీ పార్టీ తన రాజకీయాన్ని నడిపిస్తుందంటూ తులసిరెడ్డి వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న వైస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు, సకల శాఖా మంత్రి సజ్జల మాట్లాడుతూ జగన్ పై అక్రమ కేసులు పెట్టి జగన్ ను జైలు పాలుచేసి వైస్ కుటుంబాన్ని రోడ్డుమీదకు తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల మద్దతు ఎందుకు తెలిపిందో అర్థం కాలేదంటూ వ్యాఖ్యానించారు.అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలకే కౌంటర్ ఇచ్చారు తులసిరెడ్డి.

ADVERTISEMENT

వైస్ రాజశేఖర్ రెడ్డికి 5 సార్లు అసెంబ్లీ పులివెందుల టిక్కెట్, 4 సార్లు కడప లోక్ సభ టిక్కెట్ ఇవ్వడమేనా కాంగ్రెస్ పార్టీ వైస్ కుటుంబానికి చేసిన చెడు?,సీతులు అంజయ్య, బోనా వెంకటరావు,కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి ముఖ్యమంత్రుల హయాంలో వైస్ కు మంత్రి పదవి కట్టబెట్టడమేనా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు? వైస్ రాజశేఖర్ రెడ్డిని రెండు సార్లు పిసిసి అద్యక్ష్యుడిగా,ఒక సారి సీఎల్పీ లీడర్ గా నియమించడమేనా కాంగ్రెస్ పార్టీ వైస్సార్ కు చేసిన ద్రోహం?

అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు వైస్సార్ కు ముఖ్యమంత్రి అవకాశం కల్పించడమే కాంగ్రెస్ పార్టీ వైస్ కుటుంబానికి చేసిన అతి పెద్ద నేరం? కడప జిల్లాకు వైస్సార్ జిల్లాగా పేరుమార్చడమే కాంగ్రెస్ పార్టీ వైస్ కు చేసిన అవమానం? రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వివేకానందకు మూడు సార్లు పులివెందుల అసెంబ్లీ టికెట్, రెండు సార్లు కడప ఎంపీ టికెట్, ఒకసారి కాంగ్రెస్ మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వడం..,దిన్నేనా ఇబ్బంది పెట్టడం అంటారు?

అంతెందుకు వైసీపీ పార్టీని స్థాపించి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మీ అధినేత వైస్ జగన్ కు కడప లోక్ సభ టికెట్ ఇచ్చి రాజకీయాలలో తన తొలి అడుగువేసేందుకు అవకాశం అందించడమే కాంగ్రెస్ పార్టీ చేసిన మహాపరాధామా? అలాగే వైస్సార్ కుటుంబసభ్యులైనా వైస్ చిన్నాన్నకు, వైస్ సతీమణి విజయమ్మకు, విజయమ్మ తమ్ముడైన రవీంద్రనాథ్ రెడ్డికి రాజకీయాలలో అవకాశం కల్పించడమేనా కాంగ్రెస్ పార్టీ వైస్ కుటుంబానికి కల్పించిన ఇబ్బందులు.

దేశంలో ఏ కుటుంబానికి లేని విధంగా కాంగ్రెస్ పార్టీ వైస్సార్ కుటుంబానికి చేసిన మేలుకు వైస్ కుటుంబ సభ్యులంతా వాళ్ళ చర్మం వలిచి కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పులు కుట్టించినా కాంగ్రెస్ పార్టీ ఋణం తీర్చుకోలేరు అంటూ సజ్జలకి., వైకాపా నేతలకు గట్టి కౌంటర్ వేశారు తులసి రెడ్డి. పనిలో పనిగా దేశంలో ప్రముఖ నగరాలలో వైస్ జగన్ కు ఉన్న ప్యాలస్ ల లిస్ట్ కూడా ప్రజలకు మరోసారి గుర్తుచేశారు.

ఇలా కాంగ్రెస్ఆ..వైస్ కుటుంబమా..ఏది గొప్పా?దేని వైపు న్యాయం ఉంది అనే తులాభారంలో తులసిరెడ్డి కృష్ణ తులాభారంలో రుక్మిణి వేసిన తులసి ఆకు మాదిరి తన ప్రశ్నలతో తులాభారానికి పరిష్కారం చూపారు.అందుకే అంటారు “అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా” అని!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Review: USA Premiere Report

Ranabaali Review: History Without Heart A film rooted in heart-wrenching stories is let down by…

4 hours ago

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

7 hours ago