
ఈ తనిఖిల్లో భాగంగా జూబ్లీహిల్స్ లో ప్రముఖ టీవీ యాంకర్ ప్రదీప్ పట్టుబడ్డాడు. సాధారణంగా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడి బ్రీత్ అనలైజర్ టెస్టులో 35 పాయింట్లు దాటితే, వాహనం సీజ్, శిక్ష తప్పదు. ఇక గత రాత్రి యాంకర్ ప్రదీప్ కు అయితే ఏకంగా 178 పాయింట్లు వచ్చాయి. అంటే, ఇది చాలా అధికమనే చెప్పవచ్చు. సాధారణంగా ఒక పెగ్గు తాగితే 30 నుంచి 32 పాయింట్ల వరకూ బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిజల్ట్ చూపుతుంది. ఇక ప్రదీప్ కు 178 పాయింట్లు వచ్చాయంటే, కనీసం హాఫ్ బాటిల్ వరకూ తాగుండాలి. ఇప్పటి నిబంధనల ప్రకారం, 100 పాయింట్లు దాటి పట్టుబడితే, రెండు రోజుల నుంచి వారం రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు.
దీనికి కూడా వ్యక్తి హోదా, నడుపుతున్న వాహనం, ఎన్నోసారి పట్టుబడ్డాడన్న విషయాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ మేరకు ఇప్పటికే నిబంధనలను సవరించిన విషయం తెలిసిందే. ఈ నిబంధనలను అనుసరించి ప్రదీప్ కు జైలు శిక్ష తప్పదని పోలీసు వర్గాలు అంటున్నాయి. గత రాత్రి ఆయన వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు, మంగళవారం నాడు కౌన్సెలింగ్ కు, కోర్టుకు హాజరయ్యేందుకు రావాలని ఆదేశించారు. దీంతో కొత్త సంవత్సరం వేడుకలు కాస్తా యాంకర్ ప్రదీప్ కు విషాదంగా మారాయి.
Yash’s Toxic has been getting mixed reactions since its release, but the actor is finding…
The YSR Congress top leadership is absolutely rattled by the recent developments concerning Vijaya Sai…