
అవును… ఇందుకు ఊతమిచ్చింది కూడా రవిప్రకాషే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ ఆడియో వేడుక మీద టీవీ9 అధినేత ఇచ్చిన ప్రసంగమే ఈ వార్తలు పుట్టుకు రావడానికి కారణమయ్యాయి. సినీ వేదిక మీద పవన్ రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ… గత ఎన్నికలలో పవన్ చేసిన సాయానికి సాధారణంగా ఏ రాజకీయ నేత అయినా గానీ, ఏ మంత్రి పదవి దక్కించుకోవడమో లేక వ్యక్తిగతంగా ఆస్తులు కూడబెట్టుకునే వ్యవహారాలు చేయడమో చేసేవారు. కానీ, పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధంగా ఒక కొత్త సంస్కృతిని రాజకీయాలను పరిచయం చేసారు.
కేవలం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ… ప్రత్యేక హోదా, నోట్ల రద్దు వంటి కీలక అంశాలపై నిజాయితీగా వ్యవహరిస్తున్న పవన్ ను నేను బాగా ఇష్టపడుతున్నానని, ఎన్నికలకు ముందు ఒక మాట, తర్వాత మరో మాట మాట్లాడే రాజకీయ నేతలు మారాలంటూ పవన్ ప్రశ్నిస్తున్న విధానం తనకు నచ్చిందని, రాజకీయాల్లో సరికొత్త విధానాలకు పవన్ కళ్యాణ్ నాంది పలికారని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ రోజుల్లో నిజాయితీగా ఉండడం, సత్యం వెనుక నిలబడడం చాలా కష్టమైన విషయమని, కానీ దేనికి భయపడకుండా ఆ సత్యం వెనుక నిలుస్తున్నందుకు అభినందనలు తెలుపుతున్నానని రవిప్రకాష్ అన్నారు.
ఒక్క ముక్కల్లో చెప్పాలంటే… జనసేన పార్టీకి తన మీడియా సంస్థ అయిన టీవీ9 అండదండలు పుష్కలంగా ఉంటాయని రవిప్రకాష్ బహిరంగంగా చెప్పారు. దీంతో పవన్ చేతిలో కూడా ఓ మీడియా సంస్థ వచ్చి చేరినట్లయ్యింది. దీనిని పవన్ రాజకీయ ప్రచారానికి వినియోగించుకున్నా, లేకున్నా… రాబోతున్న కాలంలో ‘జనసేన’ గురించి టీవీ9 పాజిటివ్ కధనాలు రావడం అయితే స్పష్టం. ఇదిలా ఉంటే… గతంలో కాంగ్రెస్ పార్టీకి చేసిన ఓ ‘చిరు’ సాయానికి ఓ కేంద్రమంత్రి పదవి దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించే రవిప్రకాష్ ఆ వ్యాఖ్యలు చేసారా? అన్నది కూడా హాట్ హాట్ చర్చలకు దారి తీసింది.
మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…
The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…