
టీవీకే పార్టీ విజయ్ తమిళనాడు సిఎంగా ప్రమాణ స్వీకారం చేసేయబోతున్నారని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ సంతోషంతో చాలా హడావుడి చేశారు. కానీ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వరుసగా రెండుసార్లు విజయ్ అభ్యర్ధనని తిరస్కరించడంతో అందరూ షాక్ అయ్యారు.
వారు ఆ షాకులో నుంచి తేరుకునేలోగా అన్నాడీఎంకే, డీఎంకే, కాంగ్రెస్, బిజేపి, ఇతర పార్టీలు చేస్తున్న రాజకీయాలతో అందరూ తలలు పట్టుకున్నారు. దీంతో వారి విజయోత్సవం మూడు రోజులకే పూర్తిగా ఆవిరైపోయి, అసలు విజయ్ సిఎం అవుతారా లేదా? అని టెన్షన్ పడే పరిస్థితికి వచ్చారు.
ఈ మూడు రోజులలో జరుగుతున్న పరిణామాలతో విజయ్ రాత్రికి రాత్రి అత్యవసరంగా రాజకీయ పాఠాలు నేర్చుకోవాల్సివస్తోంది. ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో తెలీని పరిస్థితి నెలకొంది.
కనుక విజయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఎవరితో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు? అనేది సస్పెన్స్ గా మారింది.
విజయ్ తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు గెలుచుకోవడం మామూలు విషయం కానే కాదు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, ఎమ్మెల్యేల ఒత్తిళ్ళు, అభిమానుల ఆకాంక్షలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు జాతీయ రాజకీయలను కూడా పరిగణనలోకి తీసుకొని అడుగు ముందుకు వేసి ఉంటే ఇంత గందరగోళం ఏర్పడేది కాదు.
విజయ్ బిజేపిని వద్దని బలంగా నిలబడ్డారు కనుక వెంటనే కాంగ్రెస్ పార్టీ అయనకు మద్దతు పలికింది. విజయ్‌ని సిఎం చేయాలనీ, అయన తమతోనే కొనసాగాలని కాంగ్రెస్ పెద్దలు నిజంగా కోరుకుంటున్నట్లయితే వారు వెంటనే రంగంలో దిగి ఆయనకి మద్దతు కూడగట్టాలి. సిఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి తోడ్పడాలి. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ ఆ పని చేస్తున్నట్లు లేదు కానీ విజయ్ మళ్ళీ అన్నాడీఎంకే-బిజేపిల వైపు చూడకుండా లాక్ చేశారు.
కాంగ్రెస్‌కి ఇచ్చిన మాటకు కట్టుబడి విజయ్ డీఎంకే లేదా అన్నాడీఎంకే మద్దతు తీసుకోకపోతే నష్టపోయేది ఆయనే తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు.
అయినా డీఎంకేతో దశాబ్దాల అనుబందాన్ని పుటుక్కున తెంచేసుకొని తన చెయ్యి అందుకున్న కాంగ్రెస్ పార్టీకి, విజయ్ మాత్రం ఎందుకు కట్టుబడి ఉండాలి?
ఇప్పుడే టీవీకే పార్టీని ఆదుకోని కాంగ్రెస్ పార్టీ, రేపు మళ్ళీ ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఏర్పడితే ఆదుకుంటుందనే నమ్మకం ఏమిటి?
తమిళనాడులో తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం డీఎంకేకి హ్యాండిచ్చి ఇండియా కూటమి విశ్వసనీయతని కూడా కాంగ్రెస్ పార్టీ దెబ్బ తీసింది. ఇకపై మిత్రపక్షాలు కూడా నమ్మలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ స్వయంగా కల్పించుకుంది. ఇండియా కూటమికి నష్టం కలిగితే కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు.
కనుక విజయ్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకోవడం మంచిదా? లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపి స్నేహ హస్తం అందుకోవడం మంచిదా అంటే బిజేపిని నమ్ముకోవడమే మంచిదని అర్దమవుతోంది.
కానీ విజయ్ కాంగ్రెస్ పార్టీ తోక పట్టుకొని గోదారి ఈదే ప్రయత్నం చేస్తే అది ఒడ్డుకు చేరుకోగలదు కానీ విజయ్ మద్యలో మునిగిపోవడం ఖాయం.
ఇప్పుడే ఓ పది మంది ఎమ్మెల్యేలని సంపాదించుకోలేక నానా అవస్థలు పడుతున్నప్పుడు, బొటాబొటి ఎమ్మెల్యేలతో నడుస్తున్న ప్రభుత్వం 5 ఏళ్ళు నిలకడగా నడవగలదా?మద్యలో ఎమ్మెల్యేలు తప్పుకొని ప్రభుత్వం పడిపోతే టీవీకే పార్టీ పరిస్థితి, భవిష్యత్ ఏమిటి? అని కూడా ఆలోచిస్తే విజయ్‌కి ఎవరి మద్దతు తీసుకోవాలో స్పష్టత వస్తుంది.
Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…
The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…