డేటింగ్, రిలేషన్‌షిప్‌లు… మనకి అవసరమా?

సినీ సెలబ్రెటీలలో డేటింగ్, లివ్-ఇన్‌-రిలేషన్‌షిప్‌లు, బ్రేకప్స్ వంటివి చాలా కామన్. అవి వారికీ, వారి సినిమాలకు ఫ్రీ-పబ్లిసిటీగా ఉపయోగపడతాయి. ఒకవేళ వాటితో సమస్యలు వచ్చినా వారికి ‘ఫరక్’ పడకపోవచ్చు.

కానీ రాజుగారు చేస్తే శృంగారం. అదే సామాన్యుడు చేస్తే అక్రమ సబంధమవుతుందన్నట్లు, ఇలాంటి వ్యవహరాలలో సామాన్యులు చిక్కుకుంటే వారి జీవితం ఏవిధంగా తారుమారుతుందో అర్థం చేసుకునేందుకు ఇదొక చిన్న ఉదాహరణ.

ADVERTISEMENT

హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపిఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి, తనను లైంగికంగా వేధించేవాడని, అసభ్య సందేశాలు పంపించేవాడని, ట్రైనీ ఐపిఎస్ అధికారిణి పోలీసులకు పిర్యాదు చేశారు.

అతను కత్తి చూపి బెదిరించి తనని లొంగదీసుకుని, ఆ వీడియోని రికార్డ్ చేసి తన భర్తకి వాట్సప్ ద్వారా పంపాడని ఆమె పిర్యాదు చేశారు. అత్తాపూర్ పోలీసులు పలు సెక్షన్స్ కింద అతనిపై కేసు నమోదు చేశారు.

ఆమె పిర్యాదు చేసిన మర్నాడే అతను నగరంలోని బంధువుల ఇంటికి వచ్చి శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కానీ వైద్యులు అతని ప్రాణం కాపాడారు.

ఆమె చెప్పిన దానికి పూర్తి భిన్నమైన స్టోరీ సూసైడ్ లెటర్‌లో వ్రాశాడు. మేమిద్దరం ఏడాదిగా రిలేషన్ షిప్‌లో ఉన్నాము. మా ఇద్దరి మద్య శారీరిక సంబంధం కూడా ఉంది. ఇటీవల ఆమె వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. తిరిగి వచ్చిన తర్వాత కూడా మా ఇద్దరి మద్య శారీరిక సంబంధం కొనసాగింది. ఇక వద్దని చెప్పినా ఆమె వినేది కాదు. తనంతట తానే నా రూమ్‌కి వస్తుండేది.

ఈ నెల 9న వచ్చినప్పుడు కూడా ఆమె నా రూమ్‌లోకి రాగానే నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకొని ఎప్పటిలాగే సెక్స్‌కి సిద్దమయింది. ఈ సందర్భంగా మా ఇద్దరి మద్య గొడవ జరిగింది.

ఆమె పోలీసులకు కట్టుకథ చెప్పి నాపై కేసు నమోదు చేయించింది. ఆమె భర్త మరికొందరు ఆమెను ప్రోత్సహించారు. ఈ అప్రదిష్ట భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.

ఎందుకైనా మంచిదని సాక్ష్యాధారాల కోసం నేను ఎప్పటికప్పుడు మా ఫోటోలు, వీడియోలు నా ఐ ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. ఆమె భర్తకు కూడా ఈ విషయం తెలియాలనే నేను మా వీడియోని అతనికి పంపించాను. ఆమె నాకు పంపిన మెసేజ్‌లు, మేమిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, ఆమె స్వయంగా నా రూమ్‌కి వచ్చేదని రుజువు చేసే ఫోటోలు, వీడియోలు నా ఐ ఫోన్లో ఉన్నాయని సూసైడ్ లెటర్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నాడు.

ఒకవేళ ఆమె చేసిన ఆరోపణలే నిజమైతే జైలు పాలవుతాడు. ఒకవేళ ఆమె చేసిన ఆరోపణలు నిజం కాకపోయినా ఐపీఎస్ అధికారిగా శిక్షణ పొందుతూ సాటి మహిళాఐపీఎస్ అధికారిణితో రాసలీలలు జరిపినందుకు, ఆ ఫోటోలు, వీడియోలు ఆమె భర్తకి పంపి బ్లాక్ మెయిల్ చేసినందుకు, ఆత్మహత్యా నేరం కింద అతనిపై చర్యలు తప్పవు. కనుక బహుశః ఇక్కడితో అతని కెరీర్, జీవితం రెండూ ముగిసిపోవచ్చు.

ఒకవేళ ఆమె తప్పు లేకపోయినా, ఈ వ్యవహారం, ఈ కేసు, దీని గురించి మీడియాలో వస్తున్న వార్తలు, ఆమె భర్తకు అతను పంపిన ఫోటోలు, ఫోటో వీడియోలు వగైరాలు ఆమె జీవితాన్ని తారుమారు చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారం వలన పోలీస్ అకాడమీ ప్రతిష్టకు భంగం కలిగినందున ఆమెపై చర్యలు తీసుకుంటే కెరీర్ కూడా దెబ్బతింటుంది.

ఇద్దరిలో తప్పు ఎవరిదనే విషయం పోలీసుల విచారణలో ఎలాగు తేలుస్తారు. కానీ అత్యంత క్లిష్టమైన ఐపిఎస్ స్థాయికి చేరిన వారిరువురి జీవితాలు ఈ కేసు లేదా వ్యవహారంతో సర్వనాశనం చేసుకున్నారని అర్ధమవుతూనే ఉంది.

కనుక పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే శరీరం మీద వాతలే మిగులుతాయి తప్ప నక్క ఎన్నటికీ పులి కాలేదు. ఇలాంటి రిలేషన్‌షిప్‌లు కూడా అంతే!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ప్రతిపక్షాలకు మాత్రమే: గెలిస్తే ప్రభుత్వ వ్యతిరేకత…ఓడితే ప్రభుత్వ దౌర్జన్యం…

స్థానిక ఎన్నికల సమరానికి పార్టీ క్యాడర్, లీడర్ లకు కూటమి ప్రభుత్వం మీద యుద్ధం చెయ్యాల్సిందే అంటూ తేల్చి చెప్పిన…

13 minutes ago

Nani’s The Paradise: Is an A Certificate Waiting?

Nani’s The Paradise is heading towards a September 24 release with a 2 hour 49…

17 minutes ago