
దీనికి తగ్గట్టే కొన్ని ముఖ్యమైన అంశాలను రివీల్ చేశారు. పవన్ పెళ్లిళ్ల టాపిక్, త్రివిక్రమ్ తో స్నేహం, తల్లి భార్య ఇద్దరిలో ఎవరంటే ఎక్కువ భయపడటం, చరణ్ తో ఫోన్ కాల్, చాలా ఏళ్ళ క్రితం వివాదాస్పదంగా పత్రికల్లో హైలైట్ అయిన పిస్తోల్ వ్యవహారం, గుడుంబా శంకర్ ప్యాంట్ తాలూకు జ్ఞాపకాలు, సుస్వాగతం ఓపెనింగ్ రోజున బాలయ్య చరణ్ మొదటిసారి కలుసుకోవడం లాంటి ప్రస్తావనలన్నీ ఈ ఫస్ట్ పార్ట్ లో తెచ్చేశారు. బండ్ల గణేష్ ని అనుకరిస్తూ బాలకృష్ణ ఈశ్వరా పవనేశ్వరా అనడం అన్నిట్లోకి హైలైట్ గా నిలిచింది.
వీటితో పాటు సాయి ధరమ్ తేజ్ ఎంట్రీ, తొడ కొట్టమంటే బాలయ్య తొడ కొట్టేందుకు ప్రయత్నించడం, పెళ్లి చూపుల జోకులు ఇదంతా సరదాగా గడిచిపోయింది. క్యాస్టూమ్స్ తో పాటు కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అరుదైన కలయికగా ఈ భాగం మీద జనాల ఆసక్తి మాములుగా లేదు. వీరసింహారెడ్డి విజయం తర్వాత ఇటీవలే అక్కినేని కామెంట్ల విషయంలో బాలయ్య వివాదానికి గురి కావడం, సోషల్ మీడియాలో రచ్చ అయ్యాక దానికి వివరణ ఇవ్వడం వగైరా పరిణామాల నేపథ్యంలో అన్ని కోణాల్లో హైప్ పెరుగుతున్న మాట వాస్తవం
మూడో సీజన్ కు కావాల్సిన మైలేజ్ ని ఈ కాంబినేషన్ తోనే సెట్ చేయాలని ఆహా ఆశిస్తోంది. దాన్ని క్యాష్ చేసుకునే కారణంతోనే రెండు భాగాలు ప్లాన్ చేసింది. గతంలో ఎప్పుడూ ఇంత చనువుగా బాలకృష్ణ పవర్ స్టార్ కలుసుకున్న సందర్భం ఎప్పుడూ లేదు. అందుకే ఇందులో మూమెంట్స్ ని చాలా స్పెషల్ గా చూస్తున్నారు ఇద్దరి అభిమానులు. ఇది భారీ స్థాయిలో క్లిక్ అవ్వడం ఖాయంగానే కనిపిస్తోంది. ఫిబ్రవరి 3న స్ట్రీమింగ్ కాబోతున్న ఈ స్పెషల్ కాంబో నుంచి ట్విట్టర్ ఇన్స్ టాలకు కావాల్సిన స్టఫ్ బోలెడు దొరికేలాగే ఉంది
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…