
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో శాంతి నెలకొల్పుతానని అంటారు. ఆయనకు ఆ బాధ్యత ఎవరూ అప్పగించేలేదు. ఆయనే పుచ్చేసుకున్నారు. కానీ ఆయన వల్లనే యావత్ ప్రపంచ దేశాలలో అశాంతి నెలకొంది.
వాణిజ్య సుంకాలు, హెచ్-1బీ వీసాలతో నెలకొన్న అశాంతి సరిపోదన్నట్లు ఇప్పుడు ‘ఈఏడీ’ (ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) వర్క్ పర్మిట్లకి కత్తెర వేశారు.
భారత్‌తో సహా అనేక దేశాల నుంచి హెచ్-1బీ వీసాలతో అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నవారు అనేక లక్షల మంది ఉన్నారు. అమెరికాలో ఒక్కరి సంపాదనతో కుటుంబం పోషణ చాలా కష్టం. ఇంటి అద్దెలు, అప్పులు, పిల్లలు, చదువులు, ఇతరత్రా అనేక ఖర్చులుంటాయి. కనుక వారి జీవిత భాగస్వాములు కూడా ఈఏడీ వర్క్ పర్మిట్ తీసుకొని ఉద్యోగాలు చేస్తుంటారు.
ఇంతకాలం వారి వీసాలు రెన్యువల్ చేయించుకున్న సమయంలోనే వారు ఉద్యోగాలు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించే ‘ఈఏడీ’ కూడా ఆటోమేటిక్‌గా 18 నెలలకు రెన్యువల్ అయిపోతుండేవి. కానీ నేటి నుంచే ‘ఈఏడీ’ ఆటోమేటిక్ రెన్యువాల్ విధానాన్ని నిలిపివేస్తున్నట్లు యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ ప్రకటన జారీ చేసింది.
ఇకపై ఈఏడీ వర్క్ పర్మిట్ కోసం ప్రతీసారి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటేనే రెన్యువల్ చేయబడుతుందని తెలిపింది.
మొదటిసారి ఈఏడీ వర్క్ పర్మిట్ కోసం అనుమతి సాధించడమే చాలా కష్టం. అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. ఇప్పుడు ప్రతీసారి కొత్తగా దరఖాస్తు చేసుకొని అనుమతి సాధించాలంటే ఇంకా చాలా కష్టమవుతుంది.
ముఖ్యంగా పెరుగుతున్న వయసు, కుటుంబ భారం, పని ఒత్తిడి, ఆర్ధిక, ఆరోగ్య సమస్యల వంటివాటి వలన ఈఏడీ వర్క్ పర్మిట్ సాధించడం చాలా కష్టంగా మారుతుంది. కనుక ఈఏడీ వర్క్ పర్మిట్ సంపాదించుకోలేకపోతే కుటుంబ పోషణ చాలా కష్టమవుతుంది.
అమెరికాలో పుట్టి పెరిగి అక్కడే చదువు కుంటున్న పిల్లలు గల కుటుంబాలు కోకొల్లలున్నాయి. అలాగే అమెరికా ఉద్యోగాలు, ఆదాయాన్ని నమ్ముకొని అక్కడే అప్పోసొప్పో చేసి ఇళ్ళు, కార్లు కొనుక్కున్నవారున్నారు.
అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ స్వదేశంలో తల్లితండ్రులను పోషిస్తున్నవారున్నారు. స్వదేశంలో కూడా ఈఎంఐలు వగైరాలు చెల్లిస్తున్నవారు కూడా ఉన్నారు.
కనుక ఈ పరిస్థితిలో జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేయడం చాలా అవసరం. కనుక ఈఏడీ వర్క్ పర్మిట్ లభించకపోతే అక్కడ అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నవారరు, స్వదేశాలలో వారిపైనే ఆధారపడి జీవిస్తున్నవారి జీవితాలు అల్లకల్లోల్లం అయ్యే ప్రమాదం పొంచి ఉంది.
ఈఏడీ వర్క్ పర్మిట్ లభించకపోతే అమెరికాలో ఖర్చులు భరించలేక పిల్లల చదువులు అర్ధంతరంగా నిలిపివేసి వారిని తీసుకొని జీవిత భాగస్వాములు స్వదేశాలకు తిరిగి వెళ్ళాల్సివస్తే ఆ కుటుంబాల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తేలికగానే ఊహించవచ్చు.
కానీ ట్రంప్‌కి ఇవన్నీ అనవసరం. రాత్రికి రాత్రే అన్నీ మార్చేయాలనుకుంటారు. అయన చేసే ప్రతీ సంతకంతో ప్రపంచం ఇంత కల్లోల్లం అవుతూనే ఉంది. కానీ ప్రపంచంలో శాంతి నెలకొల్పుతానని అంటారు.
Trouble is growing for YouTuber Ramanandana as the visa fraud controversy takes another turn. After…
ఎన్నికలలో టీడీపితో పొత్తుకు జనసేనలో కొందరు నేతలు, బయట కొందరు శ్రేయోభిలాషులు కూడా వ్యతిరేకించారు. కానీ గత ఎన్నికలలో ఎదురైన…