
ఇదే సమయంలో ఉద్యోగాల్లో స్థానికులకే పెద్దపీట వేస్తూ మరో బిల్లును బైపార్టిషన్ బృందం, యూఎస్ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టింది. ఇది ఆమోదం పొందితే, అమెరికాలో ఉద్యోగం చేయాలని భావించే ఇండియన్స్ కు గడ్డుకాలమేనని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా 1225 డాలర్ల ప్రత్యేక ఫీజుతో హెచ్-1బీ వీసాల ఆమోద ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసుకునే వీలును కల్పించేదే ప్రీమియం ప్రాసెసింగ్. ప్రస్తుతం పెండింగులో ఉన్న వీసాల పరిశీలనా సమయాన్ని తగ్గించేందుకు ప్రీమియం వీసాల జారీ విధానాన్ని తాత్కాలికంగా ఆపినట్టు పేర్కొంది.
హెచ్1-బీ వీసాల విషయంలో అమెరికన్ ప్రభుత్వం తీసుకు వస్తున్న మార్పులను వాణిజ్య పరమైన అంశంగానే చూడాలని, ఇమిగ్రేషన్ కు సంబంధం లేదని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి జైశంకర్ వ్యాఖ్యానించారు. మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా, అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపిన జై శంకర్, ఏ ప్రభుత్వమైనా తమ దేశ ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తుందని, ఈ విషయంలో అమెరికా, భారత్ లు ఒకే విధానాన్ని పాటిస్తున్నాయని, అమెరికాతో దీర్ఘకాల బంధం కొనసాగుతుందని అన్నారు.
కాగా, యూఎస్ మంత్రులు రెక్స్ టిల్లర్ సన్, విల్ బుల్ రాస్, జాన్ కెల్లీలతో పాటు జాతీయ భద్రతా సలహాదారు హెచ్ ఆర్ మెక్ మాస్టర్ లతో జైశంకర్ చర్చలు జరిపారు. కొత్త వీసాల బిల్లులు, భారతీయుల ఆందోళనలను ఈ సందర్భంగా అమెరికా దృష్టికి తీసుకువెళ్లారు. ఇండియాతో మరింత బలమైన ద్వైపాక్షిక బంధం కోసం అమెరికన్ కాంగ్రెస్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా జైశంకర్ వ్యాఖ్యానించారు.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…