
శాంసంగ్ స్మార్ట్ టీవీల్లో మైక్రోఫోన్లను సీఐఏ చొప్పించిందని, దీని ద్వారా టీవీని ఆఫ్ చేసిన తరువాత కూడా ఇవి పనిచేస్తూ, అక్కడి మాటలను రికార్డు చేస్తాయని పేర్కొంది. స్మార్ట్ టీవీలతో పాటు, ఇంటర్నెట్ తో అనుసంధానమైన ప్రతి ప్రొడక్టునూ సీఐఏ హ్యాక్ చేస్తోందని తెలిపింది. ప్రపంచంలోని ఏ సిస్టమ్ కూడా హ్యాకింగ్ నుంచి పూర్తి రక్షణ ఇవ్వలేదని, ఏ స్మార్ట్ సమాచారమైనా తెలుసుకునేలా సీఐఏ సాంకేతికతను వాడుతోందని పేర్కొంది.
ఐ ఫోన్లు కూడా మినహాయింపు కాదని వెల్లడించింది. కాగా, తాజా ఆరోపణలపై సీఐఏ మాత్రం స్పందించలేదు. స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఇంటెలిజెన్స్ విభాగం ఉద్యోగులు ఈ ఆరోపణలు వాస్తవం అయి వుండవచ్చని నమ్ముతున్నారు. బ్రాండెడ్ టీవీల కోసం మొగ్గుచూపే వారికి షాక్ ఇచ్చే విధంగా ఏకంగా సామ్ సంగ్ టీవీలపైనే ఆరోపణలు గుప్పించడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో టీవీ ఆఫ్ చేసి ఉన్నపుడు రహస్య విషయాలు మాట్లాడుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే.
తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో దాదాపు కనుమరుగయిపోయిందనే చెప్పాలి. తెలంగాణలో టీడీపీ…
Rashmika Mandanna has achieved another major milestone. The actress, who began her career with Kirik…