
ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ‘బోల్ట్ ఎవరో తనకు తెలియదని, తన ఫ్రెండ్ చెప్పిన తర్వాతే అతను బోల్ట్ అని తెలిసిందని, వాట్సప్ లో షేర్ చేసిన తన ఫోటోలు వైరల్ కావడం తనకు చాలా సిగ్గుగా ఉందని…’ డ్యురేట్ తెలిపింది. ఇక, ఇదే అంశంపై బోల్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఒక సెలబ్రిటీగా ఒకే మహిళతో కలిసి ఉండటం చాలా కష్టమని, ఈ విషయాన్ని తాను చాలా తేలికగా తీసుకుంటున్నానని, జమైకా సంస్కృతి విభిన్నంగా ఉంటుందని, మహిళలతో పోలిస్తే పురుషులకు ఒకరి కంటే ఎక్కువ మంది భాగస్వాములుంటారని బోల్ట్ చెప్పుకొచ్చాడు. అలాగే, ఈ విషయమై బోల్ట్ సోదరి మాట్లాడుతూ, జమైకాకు చెందిన కాసి బెనెట్ తో బోల్ట్ డేటింగ్ చేస్తున్నాడని, రెండేళ్లుగా ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని, ఆ అమ్మాయినే తన సోదరుడు వివాహం చేసుకుంటాడని చెప్పింది.
మహారాష్ట్ర ఆడపులిగా పేరు గాంచిన మహిళా రెజ్లర్ అశ్విని మనోహర్ పాల్ తన ముగ్గురు పిల్లలతో కలిసి దారాశివ్ జిల్లాలోని…
Salman Khan has lost his cool at the paparazzi once again. This time, the incident…