
దీనితో వారు ట్విట్టర్ లో ప్రొడక్షన్ హౌస్ మీద విరుచుకుపడ్డారు మరియు ట్విట్టర్లో #BanUVCreations అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా ట్రెండ్ చేశారు. ట్వీట్ల ప్రవాహాం ఎంతటికీ ఆగకపోవడంతో ప్రొడక్షన్ హౌస్ చివరకు ఒక వివరణ ఇచ్చింది. కానీ ఆ వివరణ కూడా అభిమానులను సంతృప్తిపరచలేదు.
“మనమంతా గ్లోబల్ మహమ్మారి మధ్య ఉన్నాము. ప్రస్తుత పరిస్థితి కారణంగా చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి కారణంగా, మేము మా కార్యకలాపాలన్నింటినీ ప్రస్తుతానికి ఆపేశాం. ఇది ముగిసిన తరువాత మరెన్నో అప్డేట్స్ తో ముందుకు వస్తామని మేము హామీ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండమని కోరుతున్నాం! # ప్రభాస్ 20, ”అని వారు ట్వీట్ చేశారు.
ఈ సినిమాకు ఓ డియర్, రాధే శ్యామ్ అనే టైటిల్స్ వినిపిస్తున్నాయి. అక్టోబర్ లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే విజయదశమికి కేజీఎఫ్ 2 కి విడుదల కానుండడంతో ఏం చెయ్యబోతున్నారు అనేది చూడాలి. ప్రభాస్ సాహో చిత్రం ఫెయిల్ కావడంతో బాహుబలి తో ఎంతో కష్టపడి సంపాదించుకున్న మార్కెట్ నిలుపుకోవాలంటే ఈ సినిమా హిట్ కొట్టి తీరాలి.
Following the back to back commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is…
The Andhra Pradesh State Election Commission (SEC) has rescheduled municipal elections in 99 urban local…