
గత ఐదేళ్లుగా ఇదే అపార్ట్‌మెంటులో ఉంటున్న ఆమె ఆరు నెలల కిందట భర్తతో విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. భర్త దూరం కావడంతో కొన్నాళ్లుగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన రాధిక ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి వచ్చారు. ఆ తర్వాత కాసేపటికే పరుగుపరుగున అపార్ట్‌మెంట్ పైకి వెళ్లడాన్ని ఇరుగుపొరుగు వారు గమనించారు.
కీడు శంకించి వారు పైకి వెళ్లేలోపే ఆమె పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. “నా చావుకు ఎవరూ కారణం కాదు… నా మెదడే నా శత్రువు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను” అని రాసి ఉన్న సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మానసిక ఒత్తిడి భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు తెలిపారు. అయినప్పటికీ ఆత్మహత్యకు బలమైన కారణాలు ఏమై ఉంటాయన్న కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…