Telugu

వాసివాడి తస్సాదియ్యా… పాట జోరు అదిరిందయ్యా..!

“సోగ్గాడే చిన్ని నాయనా” సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న కళ్యాణ్ కృష కురసాల – నాగార్జున కాంబో, మళ్ళీ “బంగార్రాజు” రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్ విడుదలై సంగీత ప్రియులను అలరిస్తుండగా, ముచ్చటగా మూడో సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది.

ADVERTISEMENT

‘నువ్వు పెళ్లి చేసుకెళ్లిపోతే బంగార్రాజు’ అంటూ ప్రారంభమైన ఈ పాటను చిత్ర యూనిట్ ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’గా ప్రమోట్ చేస్తోంది. లిరికల్ సాంగ్ విన్న తర్వాత, విజువల్ గా చూసినా గానీ ‘పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ టైటిల్ కు సూట్ అయ్యే విధంగానే ఉంది. ఈ పాటకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణనే లిరిక్స్ అందించడం మరో విశేషం.

ముఖ్యంగా ‘వాసివాడి తస్సాదియ్యా, పిల్ల జోరు అదిరిందయ్యా… వాసివాడి తస్సాదియ్యా, దీని స్పీడ్ కు దండాలయ్యా’ అనే లిరిక్స్ తో పాటలో జోష్ మామూలుగా లేదు. అలాగే నాగార్జున – నాగచైతన్యలు ఒకేసారి స్క్రీన్ పై డ్యాన్స్ లు వేయడంతో ఈ మాస్ సాంగ్ అక్కినేని ఫ్యాన్స్ కు ఈ పాట ఫీస్ట్ కానుంది. మాస్ పాటలకు ఊపొచ్చే నృత్యాలు సమకూర్చే శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.

‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా ఈ స్పెషల్ సాంగ్ లో తళుక్కుమంది. “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమాకు సూపర్బ్ ఆడియో ఆల్బమ్ ఇచ్చిన అనూప్ రూబెన్స్ “బంగార్రాజు”కు కూడా అంతే స్థాయిలో ఇచ్చాడని రిలీజ్ అయిన మూడు పాటలు స్పష్టం చేసారు. మరి ఈ లేటెస్ట్ సెన్సేషన్ పై మీరూ ఓ లుక్కేసి ‘వాసివాడి తస్సాదియ్యా’ అనేయండి!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ramayana Is A Story That Lives Within Us: Ranbir

The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…

4 hours ago

Bloody Romeo: Sujeeth’s Presentation of Nani Most Crucial

Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…

5 hours ago