
కానీ సిల్వర్ స్క్రీన్ కంటే ముందు స్మాల్ స్క్రీన్ పై ఈ పాటను విడుదల చేయడం విశేషం. సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్స్ గా భావించే ఈ పాట వీడియో ప్రోమోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రేక్షకులకు థ్రిల్ ఫీల్ అయ్యేలా కనిపించే ఈ పాటను విడుదలకు ముందే రిలీజ్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? అన్నది అర్ధం కాని అంశం. కానీ పాటలోని హైలైట్స్ చూపించకుండా కేవలం మహేష్ నడిచి వచ్చే షాట్స్ ను మాత్రమే కట్ చేయడం హైప్ ను తగ్గించడానికేమో అన్న సందేహాలు కూడా నెలకొన్నాయి.
‘బాహుబలి 2’ సినిమాలో ‘పడమర కొండల్లో…’ అనే పాట ప్రభాస్ ను ఏ విధంగా అయితే ఎలివేట్ చేసిందో… ఈ ‘భరత్ అనే నేను’ సినిమాలో ‘వచ్చాడయ్యో సామి’ ఆ రేంజ్ లో చూపిస్తుందని అభిమానులు ఆశిస్తున్న నేపధ్యంలో… ఈ వీడియో ప్రోమో వారి అంచనాలను కాస్త తగ్గించిందనే చెప్పవచ్చు. సెన్సార్ పూర్తయిన తర్వాత స్తబ్దుగా ఉన్న ‘భరత్ అనే నేను’ పబ్లిసిటీలో ‘వచ్చాడయ్యో సామి’ వీడియో సాంగ్ ఎలాంటి బజ్ ను ఏర్పరచలేదు గానీ, విజువల్ ఫీస్ట్ ఖాయం అన్న నమ్మకాన్ని ఇచ్చింది.
Rishab Shetty's Shivaji Maharaj biopic is getting a new production partner. Bhushan Kumar has joined…
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు మెజార్టీ సీట్లు దక్కించుకుంటే వార్త అవుతుంది తప్ప అధికార పార్టీ దక్కించుకుంటే కాదు.…