Telugu

SRH…300 – వైభవ్..200 – సాధ్యమేనా.?

ఇటీవలే రాజస్థాన్ జట్టు వాన్ఖేడ్ వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుపై విజయాన్ని నమోదు చేసి ప్లే-ఆఫ్స్ కు చేరుకోవడమే కాదు పంజాబ్, కోల్కతా వంటి జట్లను ప్లే-ఆఫ్ బరిలో నుండి బయటకు పంపిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుత ఐపీల్ చిచ్చరపిడుగు, RR హాట్ హిట్టర్ ‘వైభవ్’ ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసాడు.

నిన్న మ్యాచ్లో ముంబై ను ఢీ కొట్టి RR మ్యాచ్ ను కైవసం చేసుకున్నప్పటికీ ఈ చిచ్చరపిడిగు వైభవ్ సూర్యవంశీ బ్యాట్ నుండి పరుగులు రాబట్టలేకపోయాడు. కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగిన ఈ కుర్రాడు కెవిన్ పీటర్సన్ తో కలిసి జరిగిన ఇంటర్వ్యూ లో ‘తాను టి-20 లో 200 స్కోరును ఎప్పటికైనా అందుకుంటా’ అని అన్నాడు.

ADVERTISEMENT

ఐపీఎల్ ప్రారంభమయ్యే ముందు జరిగిన ఒక అవార్డ్స్ ఫంక్షన్ లో హర్ష భోగ్లే అడిగిన ఒక ప్రశ్న కు ‘క్రిస్ గేల్ పేరిట ఉన్న హైయెస్ట్ స్కోరు 175 ను బద్దలుకొట్టటం అంటే తనకు ఎంతో ఇష్టం’ అని చెప్పిన వైభవ్, ఇంతలోనే 200 కొట్టటం నా లక్ష్యం అంటూ చెప్పటం ఫాన్స్ ను ఉత్కంఠ పరుస్తుంది. 15 ఏళ్ళ వయసులో ఈ కుర్రాడు చూపిస్తున్న కాన్ఫిడెన్స్ మరియు ఆటతీరుకు ముగ్ధులవని క్రికెట్ అభిమాని ఉండడు.

అయితే, అది అలా ఉండగా, మరోపక్క ఎస్.ఆర్.హెచ్ ఫాన్స్ ను ఎప్పటినుండో ఊరిస్తున్న ఆ 300 విషయం మళ్ళీ లైం-లైట్ లో కి వచ్చింది. 2024 లో వరుసగా భారీ స్కోరులతో టి-20 క్రికెట్ ను మార్చేసిన హైదరాబాద్ జట్టు చేసిన 287 పరుగుల స్కోరు, ఇప్పటికి ఐపీఎల్ లో అత్యధిక టోటల్ స్కోరుగా నిలిచింది.

పలుసార్లు పలు జట్లు ఆ స్కోరును దాటి ముందుకు వెళ్లే ఛాన్స్ వచ్చినప్పటికీ, ఏ జట్టు కూడా ఆ రికార్డును చెరపలేకపోయింది. ఈ సీజన్ లో కూడా రెచ్చిపోయి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ బ్యాటర్లు ఏదొక పట్టాన ఈ 287 ను దాటటం పక్కా అనుకున్నప్పటికీ, ఇప్పటివరకు 287 ను దాటంలో విఫలమయ్యారు అందరు.

మరి ఓ పక్క వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ళ వయసులో టి – 20 లో వ్యక్తిగత 200 వంటి భారీ మైల్-స్టోన్ ను టార్గెట్ గా పెట్టుకోవడంతో అనేక మంది అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అతడు 20 ఓవర్లు క్రీజులో ఉంటె ఈ స్కోరు అతనికి పెద్ద పనేమీ కాదు అంటూ పలువురు కామెంట్స్ చేస్తుండటం విశేషం. మరి, ఐపీఎల్ లో మొదటిగా వైభవ్ 200 టార్గెట్ ని అందుకుంటాడా.. లేదా ఎస్.ఆర్.హెచ్ 300 రికార్డు ని అందుకుంటుందా..? అనేది చూడాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Bigg Boss Telugu: Two Evictions Already In The House

For the first time in Bigg Boss history, there is a double eviction in the…

19 minutes ago

Toxic English Version Flops: Yash’s Ramayana at Risk?

Toxic has emerged as an epic disaster at the box office. While the movie bombed…

2 hours ago