
కొంతమంది వైసీపీ నేతల అత్యుత్సహం, స్వామి భక్తి వారిని కటకటాల పాలు చేసింది. ఇందులో ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
2019 లో టీడీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యే గెలిచి, వైసీపీ అధిష్టానం మెప్పు కోసం టీడీపీ పార్టీ అధినేత సతీమణి పై అనుచిత వ్యాఖ్యలు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి ఘటనలో కూడా వంశీ కీలక పాత్ర పోషించడం.
సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో అరెస్టయిన వంశీ నేటికీ బైలు రాక జైలుకే పరిమితమయ్యారు. తనకు ఈ కేసులో బైలు కావాలంటూ వంశీ వేసిన పిటిషన్ ను కొట్టేసింది న్యాయస్థానం. దీనితో వంశీ కి ఈ జైలు కష్టాలు బెయిలు ఆశలు సీరియల్ మాదిరి సాగుతూ వస్తున్నాయి.
ఇక టీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్టు నేపథ్యంలో వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల చేసిన ఓవర్ యాక్షన్ కు ఇప్పుడు మూల్యం చెల్లిస్తున్నారు. వైస్ జగన్ పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరచడానికి మాజీ పోలీస్ గా ఉన్న గోరంట్ల పోలీస్ అధికారుల ముందే అత్యుత్సహం ప్రదర్శించి ఇప్పుడు జైలు పాలయ్యారు.
ఈ కేసులో తనకు బైలు వస్తుందేమో అన్న ఆశ నుంచి కనీసం పోలీస్ రిమాండ్ కు రాకుండా ఉంటే చాలు అనే స్థితికి చేరుకున్నారు గోరంట్ల. అయితే పోలీసుల ముందే ఒక వ్యక్తి పై దాడికి యత్నించిన కేసులో అరెస్టయిన మాధవ్ ను పోలీసులు రిమాండ్ కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనితో కేసు విచారణ జరిపిన కోర్ట్ మాధవ్ కు మే 7 వరకు రిమాండ్ విధించింది.
ఇక వైసీపీ సోషల్ మీడియా ఉన్మాదుల్లా మారిన వర్రా రవీంద్రా రెడ్డి, బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి కూడా జైలుకు బెయిలు కు మధ్య ఉగిసలాడుతూ ఉంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ వైసీపీ కార్యకర్తల పనిచేసిన ఐపీఎస్ ఆంజనేయులు కూడా రిమాండ్ కు వెళ్లారు.
ఇలా అధినేత మీద ప్రేమతో చట్టాన్ని అతిక్రమించి ఎగబడిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా దాని ఫలితం అనుభవిస్తున్నారు. అయితే ఈ దారుణాలన్నిటిని దగ్గరుండి ప్రోత్సహించిన వ్యక్తులు మాత్రం అరెస్టైన వ్యక్తుల పై సానుభూతి కురిపిస్తూ వారి స్థానంలో మరికొంతమంది నేతలను బలిపీఠం ఎక్కించడానికి సిద్ధమవుతున్నారు.
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…
A little over two years after the previous Assembly elections, Andhra Pradesh is preparing for…