
పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంకా కార్యకర్తల మనోభావాలకు తగ్గట్టుగా గత ఐదేళ్ల వైసీపీ పాపాలకు లెక్క తేలలేదు, బాబు మనసు మారలేదు, చిన్నబాబు రెడ్ బుక్ అజ్ఞాతంలోకి వెళ్లిందా అంటూ నిస్సహాయంగా మౌనరోదన అనుభవిస్తున్న టీడీపీ శ్రేణులకు నేడు బాబు తన నిశ్శబ్దముతోనే సమాధానం ఇచ్చారు.
వల్లభనేని వంశీ అరెస్టు అంటూ ఈ గురువారం ఉదయం మీడియా లో వినిపించిన వార్త, కనిపించిన దృశ్యాలు టీడీపీ అభిమానులకే కాదు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి ముఖంలో చిరు నవ్వును తెచ్చింది. ఇక ఏపీలో లోకేష్ ఇచ్చిన ఎన్నికల హామీ రెడ్ బుక్ న్యాయం జరగబోతుంది అంటూ సంబరాలు మొదలు పెట్టారు టీడీపీ శ్రేణులు.
వల్లభనేని చేసిన తప్పుకి నష్టపోయింది టీడీపీ శ్రేణులు కాదు, అలాగే వారి కుటుంబంలోని మహిళలను కాదు వంశీ అవమానించింది. అయినా కూడా విలువలు, విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరు నాడు భువనేశ్వరికి జరిగిన ఆ అవమానాన్ని తనదిగా భావించారు, బాబుకి మద్దతుగా నిలబడ్డారు, అలాగే టీడీపీ కష్టంలో భాగమయ్యారు.
వల్లభనేని వంశీ కథ జైలుకెళ్లింది, ఇక కొడాలి, రోజా వంటి నేతల కథ మొదలయ్యింది అంటూ తాడేపల్లిలో టీడీపీ కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకున్నారు. మంగళగిరి, తాడేపల్లిలో మోగిన బాణాసంచా శబ్దాలు జగన్ ప్యాలస్ ను తాకాయి. దీనితో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వైసీపీ తమ ఐదేళ్ల పాలన తాలూకా పాపాల ఫలితాలను మోయడానికి సిద్దపడాల్సిందే అనే సంకేతాలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం.
అయితే బాబు తన నిశ్శబ్దతతో కొట్టిన ఈ ఒక్క దెబ్బకు వైసీపీ కూసాలు కదిలాయి. దీనితో ఇక టీడీపీ పై నోరు పారేసిన ప్రతి ఒక్క వైసీపీ ముఖ్య నేతలు ఎలుకల మాదిరి కలుగులోకి వెళ్లాల్సిందే. ఇన్నాళ్లుగా తమ మనోభావాలను పట్టించుకోరా.? తమ మనసిక క్షోభను అర్ధం చేసుకోరా అంటూ నిట్టూర్చిన టీడీపీ శ్రేణులు వల్లభనేని అరెస్టు తో ఆనంద సాగరంలో మునిగి తేలుతున్నారు.
బాబు తనకు, తన పార్టీకి జరిగిన నష్టాన్ని మరచిపోయారు, లోకేష్ తన తల్లికి జరిగిన అవమాన్ని పట్టించుకోవడం లేదు, ఇక అంతా నార్మల్ గానే సాగుతుంది అంటూ ఇప్పుడిప్పుడే మళ్ళీ రెచ్చిపోతున్న వైసీపీ నేతలకు ఇది ఊహించని ఎదురు దెబ్బె అనాలి. బాబు కొట్టిన ఈ ఒక్క దెబ్బ టీడీపీలో ఉన్న నిశ్శబ్దాన్ని ఛేదించింది, వైసీపీ లో వైలెన్స్ మాదిరి ప్రకంపనలు సృష్టించింది.
దీనితో దెబ్బ అదుర్స్ అంటూ వల్లభనేని అరెస్టు తో మొదలైన రెడ్ బుక్ చాప్టర్ 1 , కొడాలి తో కొనసాగాలంటూ ఆశిస్తున్నారు టీడీపీ మద్దతుదారులు. ఇక పై రాజకీయం హద్దుదాటితే ఎలా ఉంటుందో కూటమి ప్రభుత్వం అరాచక వాదులకు రుచి చూపించాలంటు ప్రజాస్వామ్య వాదులు కోరుకుంటున్నారు.
Reports about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 hitting a roadblock have created fresh confusion…
BOTTOM LINE An Absolute Disaster, Nothing Works PLATFORM Netflix RUNTIME 2 Hours What Is the…