
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు. ఆ సమయంలోనే గన్నవరం టీడీపి కార్యాలయం విధ్వంసం చేయించారు.
పదవీ, అధికారం కోల్పోయిన తర్వాత కూడా వంశీ స్పీడు ఏమాత్రం తగ్గలేదు. ఆ కేసు నుంచి తప్పించుకునేందుకు తనపై పిర్యాదు చేసిన టీడీపి కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్‌ని కిడ్నాప్ చేయించారు. అది మరో కేసయింది. ఆ కేసులో కొన్ని నెలలు జైల్లో ఉండి ఈ ఏడాది జూలై 2న బెయిల్‌పై బయట పడ్డారు.
ఆ కేసు విచారణ కొనసాగుతుండగానే గత ఏడాది జూన్ 7న విజయవాడలోని మాచవరానికి చెందిన సునీల్ అనే వ్యక్తిపై ఆయన అనుచరులు దాడి చేశారు.
సునీల్ పిర్యాదు మేరకు మాచవరం పోలీసులు వంశీ, ఆయన అనుచరులు యంతీంద్ర రామకృష్ణ, అనగాని రవి, ఓలుపల్లి రంగా, ఎం.బాబు, కొమ్మా కోట్లు, మల్బూరి ప్రభుకాంత్, కాట్రు శేషులతో సహా మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. వారందరూ సునీల్‌పై దాడి చేసి హత్య చేసేందుకు ప్రయత్నించారని కేసు నమోదు చేసి సుకొని విచారణ జరుపుతున్నారు.
ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం వంశీ హైకోర్టులో ప్రయత్నించారు. కానీ లభించలేదు. మాచవరం పోలీసులు వంశీకి నోటీస్ ఇచ్చేందుకు గన్నవరంలో ఆయన ఇంటికి వెళ్ళారు కానీ అక్కడ లేరు. ఫోన్ ద్వారా నోటీస్ విషయం తెలియజేయాలని ప్రయత్నిస్తే ఫోన్ స్విచ్చాఫ్ ఉంది.
నిన్న (సోమవారం) విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టులో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు విచారణకు వంశీ హాజరు కాలేదు. కనుక అరెస్ట్ భయంతో వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లు స్పష్టమవుతోంది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక అక్రమాలకు, అరాచకాలకు పాల్పడిన వల్లభనేని వంశీ, కొత్త సంవత్సం ప్రారంభం కాకముందే ఉంటే అజ్ఞాతంలో ఉండాలి లేదా జైల్లో గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇందుకు ఆయన ఎవరిని నిందించాలి? తనని తానా లేదా అధినేతనా?
Payal Radhakrishna turns up the glamour in a shimmering bronze halter dress that feels playful,…
Bhuvneshwar Kumar is finally back in the Indian team after four years. At 36, the…