
హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ తూటాల్లా పేలాయి. అయితే కొన్ని చోట్ల వరుణ్ తేజ్ వాయిస్ కొంచెం సాఫ్ట్ అనిపించింది. అయితే చాలా వరకూ ఈ మేక్ ఓవర్ లో వరుణ్ తేజ్ ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగాడని చెప్పవచ్చు. ట్రైలర్ ని బట్టి కథను అంచనా వెయ్యడం కష్టమే. అయితే రీమేక్ చిత్రం కాబట్టి కొంత మేర మినిమం గారంటీ అనే చెప్పుకోవాలి. అన్నీ కుదిరితే వరుణ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడిపోయినట్టే. పూజా హెగ్డే గెట్ అప్ బావున్నా ఆ పాత్ర స్కోప్ ఎంతవరకు ఉంటుంది అనేది ట్రైలర్ లో క్లారిటీ లేదు.
వాల్మీకికి ఒక్క రోజు ముందుగా సూర్య బందోబస్త్ సినిమా విడుదల అవుతుంది. ఆ సినిమా మీద పెద్దగా హైప్ లేకపోవడంతో వాల్మీకికి దాదాపుగా లైన్ క్లియర్ అనే చెప్పుకోవాలి. పూజా హెగ్డే, అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం పై వరుణ్ తేజ్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. గత నాలుగు చిత్రాలలో మూడు హిట్లు ఇచ్చి మంచి ఊపు మీద ఉన్నాడు వరుణ్ తేజ్. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకి చిత్రానికి మిక్కీ జె మేయర్ చిత్రానికి సంగీతం అందించాడు.
Suriya’s long delayed project Karuppu, directed by RJ Balaji, is finally set for a worldwide…
One issue becoming impossible to ignore in the cinema industry is the growing fear surrounding…