Telugu

‘వంగవీటి’ బ్రాండ్ నేమ్ జనసేన కు మరింత బలం కానుందా.?

ఏపీలో మోగిన స్థానిక ఎన్నికల సైరన్ తో రాష్ట్ర రాజకీయాలలో వినూత్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా ఏపీ రాజకీయాలకు కేంద్ర బింధువైన విజయవాడ లో వంగవీటి రాధ టీడీపీ ని వీడి జనసేన కండువా కప్పుకున్నారు.

విజయవాడ రాజకీయాలలో వంగవీటి పేరు చాల ప్రముఖంగా వినిపిస్తుంది. రంగా మరణించి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ బెజవాడ రాజకీయాలలో ఆయన పేరు ఇప్పటికి వినిపించాల్సిందే అన్నట్టుగా ఆ ప్రాంత రాజకీయాలు ముందుకు సాగుతుంటాయి.

ADVERTISEMENT

తండ్రి రాజకీయ వారసత్వంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధా బెజవాడ రాజకీయాలలో కీలక నేతగా ఎదిగారు. అయితే గత కొన్నేళ్లుగా యాక్టీవ్ పొలిటికల్స్ కి దూరంగా ఉంటున్న రాధ తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.

నాటి నుంచి కూడా రాధ జనసేనలో చేరబోతున్నారని గట్టి ప్రచారమే జరిగింది. బెజవాడ మేయర్ సీటు కోసం పట్టుపట్టిన జనసేన తన పార్టీ తరుపున వంగవీటి కుటుంబ సభ్యులను బరిలోకి దింపనుందని, అందులో భాగంగానే రాధ, పవన్ ల భేటీ జరిగిందని మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి.

ఇప్పుడు ఆ వార్తలను వాస్తవాలు చేస్తూ నేడు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి పవన్ సమక్షంలో వంగవీటి రాధా జనసేన కండువా కప్పుకున్నారు. దీనితో విజయవాడ రాజకీయాలలో వంగవీటి బ్రాండ్ నేమ్ తో ఇక నుంచి జనసేన పేరు కూడా బలంగానే వినిపించనుంది అంటున్నారు జనసేన, వంగవీటి అభిమానులు.

అయితే ఇన్నాళ్లుగా వంగవీటి రంగా పేరుతో వైసీపీ కాపు నేతలు పవన్ టార్గెట్ గా చేస్తున్న కాపు కుల రాజకీయ విమర్శలకు ఇప్పుడు రాధా జనసేన ఎంట్రీ తో పవన్ చెక్ పెట్టనున్నారు. దానికి తోడు వంగవీటి బ్రాండ్ జనసేన కు కాపు సామాజికవర్గాన్ని మరింత చేరువ చేసే అవకాశం లేకపోలేదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pan-India Craze: Telugu Stars Ignoring a Huge Fan Base?

Baahubali took South cinema to the next level. SS Rajamouli showed the industry that regional…

24 minutes ago

AP Local Polls: YCP Starting With Disaster Slogan?

Prior to the 2024 Andhra Pradesh election, YS Jagan had this coin term of Siddham.…

54 minutes ago