
ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో చిరు ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి మరియు వరుణ్ తేజ్ లు కలిసి పొయ్యి మీద దోసెలు వేస్తున్నారు. చిరు మాత్రం తన అట్లకాడతో వరుణ్ వేసిన దోసెను చెడకొట్టేసి, ‘నేను వేసింది బాగా రాలేదు, నాకు కుళ్ళు వచ్చేసింది’ అంటూ దోసె అంతా చెల్లాచెదురు చేసేసి ఫక్కున నవ్వేశారు.
పెదనాన్న చేసిన ఈ చిలిపి చేష్టలతో వరుణ్ సైతం నవ్వులతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఈ ఉదంతం మొత్తం వీక్షిస్తున్న కుటుంబ సభ్యులు కూడా మెగాస్టార్ చేసిన చేష్టలతో చిరునవ్వులు చిందించడం ఈ వీడియోలో వినపడుతోంది. మొత్తానికి ‘దోసె’కు కాస్త ‘ఉప్మా’ చేసేసిన ఘనతను మెగాస్టార్ చిరు సొంతం చేసుకోగా, చిరు దోసెల కోసం సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లు క్యూ కట్టారు.
ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటారో లేదో అన్నది పక్కన పెడితే, కుటుంబానికి మాత్రం చిరంజీవి ఎప్పుడూ పెద్ద దిక్కుగానే ఉంటారు. ఇంత పెద్ద ఫ్యామిలీపై ఎప్పుడూ ఎవరో ఒకరు రాళ్లు వేయడానికి ప్రయత్నించినా, కుటుంబ విషయాలు గోడ దాటకుండా చూసుకోవడంలో మెగాస్టార్ “పెద్దరికం” నిజంగా ఆదర్శప్రాయమే! ఇలాగే కలకాలం కుటుంబ సభ్యులందరితో కలిసి మరిన్ని పండగలు మరపురాని విధంగా జరుపుకోవాలని ఆశిద్దాం.
The pre-release event of Ramayana was held in Hyderabad, where a large crowd gathered for…
Nani and OG director Sujeeth have teamed up for Bloody Romeo, a stylish action film…