‘మెగాహీరో’ మెచ్చిన ‘యువహీరో’ టీజర్!

త్వరలో “మిస్టర్” ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్ కు ఓ టీజర్ విపరీతంగా నచ్చేసింది. ఆ మాటకొస్తే ఒక్క వరుణ్ తేజ్ కే కాదు, చూసిన ప్రతి ఒక్కరిని ఆ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ లోనే పడేసిన నిఖిల్ “కేశవ” టీజర్ గురించే ఇదంతా! ‘చాలా ఇంటెన్స్ గా కిక్ యాస్ టీజర్ ఇదంటూ పొగడ్తలతో ముంచెత్తిన’ వరుణ్ తేజ్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ టీజర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొత్తదనంతో కూడిన సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటున్న నిఖిల్ కు సినీ ప్రేమికులు నీరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యంగా వారసత్వం రాజ్యమేలే సినీ పరిశ్రమలో నిఖిల్ లాంటి హీరోల ఎదుగుదల, ప్రతి ఒక్కరికి స్పూర్తినిచ్చే అంశంగా మారింది. ఈ టీజర్ ఈ నెల 24న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు”తో పాటు ధియేటర్లలో ప్రదర్శితం కానుంది.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

బొత్స జనసేనలో చేరుతున్నారటగా?

మాజీ మంత్రి, మండలిలో వైసీపీ పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పేసి సకుటుంబ సమేతంగా…

16 minutes ago

Revanth Reddy Blackmailed Cong: Surekha Hits Back!

The inevitable has happened as Konda Surekha has been removed from the Telangana cabinet by…

23 minutes ago