Telugu

మహిళలంటే వైసీపీ నేతలేనా? కేసులంటే ప్రతిపక్ష నేతలకేనా?

మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అలాగే అదే మహిళలు హద్దు దాటి ప్రవర్తిస్తే శిక్షార్హులే అనేది కూడా భారతీయ పురాణాలలో పొందుపరచబడింది. నాణానికి ఒక వైపే చూడు రెండో వైపు చూడకు అన్న బాలకృష్ణ సినిమా డైలాగ్ ను వైసీపీ నేతలు ఫాలో అవుతున్నట్టున్నారు. అందుకే వైసీపీ నేతలు నాణంలో తమకు నచ్చిన వైపే ప్రజలు దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు.

వైసీపీ మహిళానేతలందు రోజా వేరయా! అన్న తీరుగా రోజా రాజకీయ విమర్శలు దిగజారిపోతున్నాయి. ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి రాజకీయాలలో విమర్శలు సహజం అయితే ఆవిమర్శలు తమ స్థాయిని తగ్గించేలా ఉండకూడదు అని రోజా గ్రోహించే రోజు రావాలని ఆశిద్దాం. ఒక మహిళగా రాజకీయాలలో ఎదగడం ఎంత కష్టంతో కూడుకుందో అలాగే ఆస్థానాన్ని నిలబెట్టుకోవడం కోసం కూడా అంతే బాధ్యతగా అడుగులు వేయడం అవసరం.

ADVERTISEMENT

రోజా ఒక మహిళాగా ఉండి మహిళలే సిగ్గుపడేలా ప్రవర్తించడం, అశ్లీల హావభావాలతో తన రాజకీయ ప్రత్యర్థి పార్టీల నేతలను రెచ్చగొట్టడం,వయస్సుకి – అనుభవానికి కూడా గౌరవం ఇవ్వకుండా నోటికి పని చెప్పడం, తన రాజకీయ ఎదుగుదలకు అకారణంగా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను దూషించడం,ఇవన్నీ కూడా తన రాజకీయ సమాధికి మెట్లుగా మారుతున్నాయని గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది.

నోటికి వచ్చిందల్లా అడ్డు అదుపు లేకుండా వాడు – వీడు అంటూ కనీస మర్యాద లేకుండా ప్రతిపక్ష నేతల పై విమర్శలు చేయడం తీరా ప్రత్యర్థి పార్టీలు తిరిగి విమర్శలకు దిగితే మహిళలను అగౌరపరుస్తారా? ఆడవారిని అవమానిస్తారా? అంటూ మహిళా కార్డు బయటకు తీయడం, తమ పార్టీ కమిటీగా భావించే మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది.

అలాగే మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి. పద్మ కూడా మహిళలంటే కేవలం వైసీపీ పార్టీకి చెందిన వారే అన్నట్లు వ్యవహరించిన తీరు
ఎన్నో విమర్శలను ఎదుర్కొంటుంది.ఎన్టీఆర్, నారా వారి కుటుంబంలో ఆడవారిని కించపరిచే వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళా కమిషన్ ఎటు పోయింది? అంటూ ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్ మహిళా కమిషన్ తీరుని ఖండించారు. నారా వారి కుటుంబానికి ఎన్టీఆర్ కుటుంబం ఎప్పుడు అండగానే నిలబడుతుందని పేర్కొన్నారు.

టీడీపీ మహిళా కార్యకర్తలపై, కానీ టీడీపీ మహిళా నేతల పై కానీ, అలాగే జనసేన పార్టీ మహిళా నేతల పై కానీ వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న అకృత్యాలకు – అరాచకాలకు మహిళా కమిషన్ స్పందించాదా? సాక్షాత్తు చంద్రబాబు సతీమణి ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరికి జరిగిన అవమానానికి ఏపీ అసెంబ్లీనే సాక్షిగా మిగిలింది. సినిమా రంగంలో స్టార్ హోదాలో ఉండి రాజకీయాలలో ప్రజాదరణ కలిగిన పవన్ భార్యకు సైతం వైసీపీ సోషల్ మీడియా వేధింపులు తప్పలేదు.

రాష్ట్రంలో మహిళకు రక్షణగా పెట్టిన ‘దిశాచట్టం’ ఒక దిశ దశ లేకుండా పోయింది.చట్టాలు చేసినవాడికి కూడా ఆచట్టాలు అమలు చేయగలిగిన నాడే సమాజంలో అసమానతలు రూపుమాపగలం. తమ పార్టీ మహిళా నేతల మీద వచ్చే విమర్శల పై వేగంగా స్పందించి ఆయా నేతల పై కేసులు అంటూ హడావిడి చేసే మహిళా కమిషన్ విపక్షాల మహిళా నేతల పై అధికార పార్టీ నేతలు చేసే దిగజారుడు విమర్శల ఫిర్యాదుల పై కనీస స్పందన కూడా చూపకపోవడం మహిళలందు వైసీపీ మహిళలు వేరయా! అనే సమాధానాన్ని ఇస్తుందా అంటూ మహిళా లోకం ప్రశ్నిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Review: History Without Heart

BOTTOM LINE History Without Heart RATING 2/5 Story, Screenplay, Director: Rahul Sankrityan Cast: Vijay Deverakonda,…

5 minutes ago

Jailer 2 Day 1 BO: Great Start, But Missed Potential?

Rajinikanth's Jailer 2 has taken a strong start at the global box office and is…

8 hours ago