
పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకొన్నాడంటూ వైసీపీ నేతలు పదేపదే ఎగతాళి చేస్తుండటంతో వారికి ఆయన జవాబు చెపుతూ, తాను ఎవరికీ అన్యాయం చేయలేదని, మొదటి ఇద్దరి భార్యలకు భారీగా భరణం చెల్లించిన తర్వాతే మూడో వివాహం చేసుకొన్నానని అన్నారు. అయితే ఆవేశంలో “మీరూ చేసుకోండి ఎవరొద్దన్నారు… నేను మీలాగ ఒక పెళ్ళి చేసుకొని 30 స్టేప్నీలను మెయింటెయిన్ చేయడం లేదు కదా?” అని అన్నారు.
పవన్ కళ్యాణ్ మాటలను సాక్షాత్ ముఖ్యమంత్రే వక్రీకరిస్తూ “మేము ఏపీని అభివృద్ధి చేయడానికి మూడు రాజధానులు అవసరమని చెపుతుంటే ఒఫ్ రాజకీయ పార్టీ నాయకుడు కాదు… మూడు పెళ్ళిళ్ళు అవసరమని చెపుతున్నారు,” అని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పంపిన ఈ సంకేతాన్ని ఏపీ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మావతి బాగానే క్యాచ్ చేసినట్లున్నారు. వెంటనే పవన్ కళ్యాణ్‌కి నోటీస్ పంపించారు.
వైసీపీ నేతలు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆర్దాంగిని ఉద్దేశ్యించి అనుచితంగా మాట్లాడినప్పుడు ఏపీ మహిళా కమీషన్‌కు వినబడలేదు. కొందరు మంత్రులు గంటా, అరగంటా అని మాట్లాడినప్పుడూ వినబడలేదు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గోరంట్ల డర్టీ పిక్చర్ కనబడలేదు. ఇక రాష్ట్రంలో టిడిపి మహిళా నేతలను, మహిళా కార్యకర్తలను ఉద్దేశ్యించి వైసీపీ నేతలు చేసే అనుచిత వ్యాఖ్యలు వినబడవు.
నిన్న పసలపూడిలో పోలీసులు మహిళా రైతులపై దౌర్జన్యం చేసి గాయపరిచినప్పుదూ ఏపీ మహిళా కమీషన్‌కు కనబడదు. వినబడదు. ఇక మన తెలుగు సినిమాలలో మహిళలను కించపరిచేవిదంగా ద్వందార్ధ డైలాగులు, సన్నివేశాలు, వారి అర్దనగ్న డ్యాన్సులు కూడా బహుశః మహిళా కమీషన్ దృష్టికి వచ్చి ఉండకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చేతులు కలపాలనుకొంటున్నారు కనుక ఆయన ఏదో ఆవేశంలో అన్నమాటలను పట్టుకొని నోటీస్ పంపిచేశారు.
అయితే నిత్యం బూతులు మాట్లాడే వైసీపీ నేతలని పట్టించుకోకుండా, మహిళల పట్ల ఎంతో గౌరవంగా వ్యవహరించే పవన్ కళ్యాణ్‌కి ఏపీ మహిళా కమీషన్ నోటీస్ పంపడం చూస్తే, వైసీపీ రాజకీయ ప్రత్యర్ధులను కట్టడి చేయడం కోసమే అది పనిచేస్తోందా?రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవీ కమీషన్‌కు కనబడవా?వినబడవా?అనే సందేహం కలుగుతుంది. అధికార వైసీపీకి అనుబంద విభాగంగా పనిచేస్తుండటం వలన మహిళా కమీషన్ గౌరవం పెరుగుతుందా తరుగుతుందా? ఆలోచిస్తే బాగుంటుంది.
Former MP Vijayasai Reddy has launched a sharp attack on the TDP-led alliance and YSRCP…
Andhra Pradesh needs a strong opposition to question the TDP-led government and hold it accountable.…