
వీరప్పన్‌ను తుదముట్టించడంలో చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ఒకరు ప్రముఖ పాత్ర పోషించినట్టు బహిర్గితమైన సమాచారం ద్వారా తెలుస్తోంది. వీరప్పన్ తో సన్నిహిత సంబంధం ఉన్న పారిశ్రామిక వేత్తపై పోలీసులు నిఘా పెట్టారు. వీరప్పన్ కు చెందిన గూఢచారి ఒకరు పారిశ్రామిక వేత్తను కలుసుకునేందుకు హోటల్ కు వచ్చాడు. మంతనాలు జరిపిన తర్వాత అతను వెళ్లిపోయాడు. ఆ వెంటనే పారిశ్రామిక వేత్తను కమెండో దళాలు చుట్టుముట్టాయి. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన ఆయన అసలు విషయం చెప్పేశాడు.
తనకు చూపు మందగించడంతో కంటి ఆపరేషన్‌కు ఏర్పాటు చేయడంతో పాటు మారణాయుధాలు కూడా కావాలని వీరప్పన్ వర్తమానం పంపినట్టు తెలిపాడు. ఈ సమాచారంతో వీరప్పన్ ను పట్టుకునేందుకు పోలీసులు పావులు కదిపారు. పేరు మోసిన రౌడీ అయోధ్యకుప్పం వీరమణిని ఎన్కౌంటర్ చేసిన ఎస్సై వెల్లదురైని మారువేషంలో వీరప్పన్ వద్దకు పంపాలని విజయకుమార్ నిర్ణయించారు. అనంతరం పారిశ్రామిక వేత్తను కలిసి ప్లాన్ వివరించారు. పారిశ్రామికవేత్త ఇచ్చిన సమాచారం మేరకు వీరప్పన్ తన గూఢచారిని పంపాడు.
తాను ఓ మనిషిని పంపుతానని, అతడితో కలిసి వస్తే తిరుచ్చి, లేదంటే మదురైలో కంటి ఆపరేషన్ చేయిస్తానని గూఢచారికి చెప్పి పంపించాడు. దీంతో వీరప్పన్ గూఢచారి ఓ లాటరీ టికెట్ కొని దాన్ని సగానికి చించి ఓ ముక్కను పారిశ్రామికవేత్తకు ఇచ్చాడు. రెండో ముక్క తెచ్చే వ్యక్తితో వీరప్పన్ వస్తాడని అతడికి చెప్పి వెళ్లిపోయాడు. పారిశ్రామికవేత్త నుంచి రెండోముక్కను తీసుకున్న విజయకుమార్ దానిని ఎస్సై వెల్లదురైకి ఇచ్చి పంపి, అడవుల్లోకి వెళ్లి వీరప్పన్‌ను కలుసుకున్నారు.
దీంతో ఆయన వెంటనే వీరప్పన్ కంటి ఆపరేషన్‌కు బయలుదేరాడు. పోలీసులు ముందుగా ఏర్పాటు చేసిన అంబులెన్స్ లోకి వీరప్పన్, అతని అనుచరులను ఎస్సై ఎక్కించారు. ధర్మపురి వద్ద అప్పటికే సిద్ధంగా ఉన్న కమెండోలు అంబులెన్స్ పై కాల్పులు జరిపి వీరప్పన్‌ను హతమార్చారు. వీరప్పన్ కథకు పోలీసులు ఇలా ముగింపు పలికారు. పోలీసులకు సహకరించిన పారిశ్రామిక వేత్తను వదిలేశారు కానీ, ఆయన పేరును మాత్రం పోలీసులు ఇప్పటికీ బయట పెట్టలేదు.
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని జగన్ ముందే చెప్పుకున్నారు. అయితే, ఆ నెపాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పైకి…