
అయితే భాజపాలో టీడీపీ వ్యతిరేక వర్గంగా భావించే సోము వీర్రాజుగానీ, పురందేశ్వరిగానీ, కన్నా లక్ష్మి నారాయణగానీ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఢిల్లీలో ఒకపక్క ఆ మీటింగ్ జరుగుతుండగానే సోము వీర్రాజు మరో ప్రెస్ మీట్ పెట్టి టిడిపి పై విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగుదేశంపార్టీ చేయాల్సింది రూలింగ్ కాని, ట్రేడింగ్ కాదని సెటైర్ వేశారు.
మిత్రపక్షమైన టీడీపీ ఒక మాట అంటేనే మిత్రధర్మం గురించి లెక్చర్ ఇచ్చే వీర్రాజు మాత్రం ఏకధాటిగా రెచ్చిపోయారు. టీడీపీ నాయకులకు చంద్రబాబు లక్ష్మణ రేఖ గీయడంతో ఆయనకు అడ్డు ఆపు లేదనే చెప్పాలి. తమ పార్టీకి చెందిన మంత్రి పైడికొండల మాణిక్యాలరావుకు కనీస గౌరవం ఇవ్వటంలేదని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్ట్ ఆవశ్యకతను గుర్తించామని.. అన్ని విధాలా కేంద్రం నుంచి సాయం ఉంటుందని గడ్కరి తమకు హామీ ఇచ్చారని బీజేపీ అధ్యక్షుడు హరిబాబు తెలిపారు. 2019లోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారని ఎంపీ వివరించారు. రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న రెండు పరస్పర వ్యతిరేక పరిణామాలు విశ్లేషకులని సైతం విస్తుగొలుపుతుంది.
ఈ రొంపిలోకి సాక్షాత్తు ఉపరాష్ట్రపతి ఎందుకు రావాల్సి వచ్చిందంటే కూడా బీజేపీలో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. తన ఆప్తుడైన చంద్రబాబుని కాపాడటానికి అని ఒక వర్గం. టీడీపీతో దోస్తీ లేకపోతే పార్టీకి నష్ట్రం కాబట్టి కమలం కోసమే ఆయన ఎంటర్ అయ్యారని ఇంకొందరు చెబుతున్నారు. ఇక్కడ కూడా వైరుధ్యమే
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…