Telugu

“గురు” టాక్ ఓకే… కలెక్షన్స్ మాటేంటి..?

సోలో హీరోగా సక్సెస్ మరిచిపోయిన విక్టరీ వెంకటేష్ కు, ‘దృశ్యం’ రూపంలో ఓ బ్లాక్ బస్టర్ దక్కినట్లయ్యింది. రీమేక్ సినిమా అయినప్పటికీ, కొత్తదనంతో ఫ్యామిలీ ఏమోషన్స్ తో నిండుకుని ఉండడంతో ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. అదే ఊపులో మరో రీమేక్ తో “గురు” ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విక్టరీ. తెలుగు ప్రేక్షకులకు కాస్త కొత్త అనుభూతులు పంచే విధంగా సిద్ధమైన ఈ సినిమాపై ప్రేక్షకుల, సినీ విమర్శకుల టాక్ ఎలా ఉంది? అంటే… వెంకీ అభిమానులను ఫుల్ ఖుషీలో నింపేలా ఉందని చెప్పవచ్చు.

విక్టరీ వెంకటేష్, రితికా సింగ్ నటనలే హైలైట్ గా నిలిచిన “గురు” సినిమా కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వెంకీ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ను ఇచ్చారని సినీ విమర్శకులు కూడా జైజైలు పలుకుతున్నారు. ‘దంగల్’ వంటి సినిమాలు చూసి, మన తెలుగులో ఎందుకు ఇలాంటివి రావు అని నిరుత్సాహపడిన ప్రేక్షకులకు “గురు” సినిమా, అలాంటి అనుభూతులనే మిగులుస్తోంది. ‘దంగల్’ స్థాయి కాకపోయినా, ‘గురు’ కూడా ప్రేక్షకులను సంతృప్తి పరచడంలో సక్సెస్ సాధించింది.

ADVERTISEMENT

అయితే ఈ సక్సెస్ రెవిన్యూ రూపంలో కనపడుతుందా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. విక్టరీ వెంకటేష్ బ్రాండ్ మీదే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. చివరికి ఏ రేంజ్ కలెక్షన్స్ రాబట్టినా అది వెంకీ స్టామినాకే నిదర్శనంగా నిలుస్తుంది. అయితే ఈ తరహా కధలను స్వీకరించే తెలుగు ప్రేక్షకులు ఎంత శాతం ఉన్నారు? అన్నది ‘గురు’ సినిమాతో తేలనుంది. బాలీవుడ్ ‘దంగల్’ వంటి సినిమాలను తెలుగులో డబ్ చేస్తే, ఆదరించిన ఘనత తెలుగు ప్రేక్షకుల సొంతం. మరి అదే తెలుగు హీరో చేస్తే స్వీకరిస్తారా? అన్న ప్రశ్నకు ‘గురు’ కమర్షియాలిటి సమాధానం ఇవ్వనుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Kaaka Out of Sankranthi? Big Release Buzz Around Chiru

There is some fresh buzz around Chiranjeevi and Bobby Kolli’s Kaaka. According to industry gossip,…

21 minutes ago

ఇంత అయోమయం దేనికి రాజా?

రాహుల్‌ గాంధీ ఏ ముహూర్తాన్న ‘క్రెడిట్ చోరీ’ అనే పదం కనిపెట్టారో కానీ, ఇప్పుడు దానిని దేశంలో ప్రతీ పార్టీ,…

28 minutes ago