
ఆ మధ్య పవన్ కల్యాణ్ .. ప్రభాస్ .. ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో భారీ సినిమాలు చేసిన భోగవల్లి ప్రసాద్, కుర్ర హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ తో ‘తొలిప్రేమ’ చేసిన ఆయన, శర్వానంద్ ను కూడా లైన్లో పెట్టేశారు. ఇక అఖిల్ తో చేద్దామని సంప్రదిస్తే .. ఆయన పారితోషికం 10 కోట్లు అని తెలిసి ఆలోచనలో పడ్డారట.
అఖిల్ ను రెండు పరాజయాలు పలకరించినా, జనంలో ఆయనకి గల క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. అందువలన ఈ హ్యాండ్సమ్ హీరోకి ఆ మాత్రం ఇచ్చుకోవచ్చు అనే టాక్ కూడా ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మరి ఈ ‘అత్తారింటికి దారేది’ ప్రొడ్యూసర్ అఖిల్ తో ముందుకు వెళ్తారో లేదో చూడాలి.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…