
అదంతా పచ్చి అబద్దం అని కొట్టిపారేసిన వేణుమాధవ్, తనకు ఎఫైర్స్ ఉన్న మాట మాత్రం వాస్తవమేనని చెప్పి సంచలనం సృష్టించారు. అవి ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి… అయితే వాళ్ళేవరూ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు మాత్రం కాదని స్పష్టత ఇచ్చారు. పెళ్లిళ్ళు అయితే కాలేదు గానీ, పరిచయాలు అయితే చాలా మందితో ఉన్నాయని, అందరితో సత్సంబంధాలు కలిగి ఉండడం తప్ప వేరేగా కాదని, తర్వాత మళ్ళీ వివరణ ఇచ్చుకున్నారు వేణుమాధవ్. ఏది ఏమైనా వేణుమాధవ్ ఓ డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
ఇక, తన ఇంటి పేర్లన్నీ ‘అచ్చి వచ్చిన కృష్ణ నిలయం’ అనే ఉంటుందని, ఈ పేరు కూడా అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గార్ల పేరును కలిపి పెట్టుకున్నానని, వాళ్ళిద్దరూ లేకపోతే వేణుమాధవ్ అనే వాడు లేడని, వాళ్ళు పెట్టిన భిక్షేనని, అందుకే మా అమ్మ, నాన్నల పేరుతో పాటు వారి పేర్లు కూడా ఉంటాయని అన్నారు. ఆ ఇంటి పేరు కూడా నటుడు ఉత్తేజ్ ను సలహా కోరగా, ఆయన చెప్పారని, తన ప్రతి ఇంటికి అదే పేరు ఉంటుందని అన్నారు. తానూ ఆర్ధికంగా పరిపుష్టిగా ఉన్నానని, తనకు పది ఎకరాల పొలం ఉందని, పది ఇల్లులు ఉన్నాయి, వాటికి అద్దెలు వస్తాయంటూ తన ఆర్ధిక స్థితిగతులను కూడా వివరించారు.
Reports about Prabhas reuniting with Darling director Karunakaran may turn out to be false. Initial…
A shocking incident at a government school in Raptadu has triggered widespread outrage. A Class…