Telugu

విజయ్‌ మార్క్ పాలన ఇంకా మొదలవనే లేదు అప్పుడే…

ఇటీవల తమిళనాడు ఎన్నికలలో టీవీకే పార్టీ సాధించిన సీట్ల గురించి, దాని అధినేత విజయ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేయడం గురించి దేశవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది. ఆయన ప్రభుత్వం కూలిపోతుందంటూ డీఎంకే అధినేత, మాజీ సిఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు.

వెంటనే సిఎం విజయ్‌ ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీతో భేటీ అవడంతో తమిళనాడు రాజకీయాలలో మళ్ళీ ఏవో అనూహ్య పరిణామాలు జరుగబోతున్నాయని అందరూ ఊహించారు. అందరూ ఊహించినవేవీ జరుగలేదు కానీ తమిళనాడు బిజేపి మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడంతో మళ్ళీ సరికొత్త రాజకీయ పరిణామాలు మొదలయ్యాయి.

ADVERTISEMENT

అయన బిజేపికి రాజీనామా చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, “నాకు తమిళనాడు ప్రజల సమస్యలు, అవసరాలు ఏమిటో నాకు బాగా తెలుసు. వారు ప్రభుత్వం, రాజకీయ పార్టీల నుంచి ఏం కోరుకుంటున్నారో నాకు తెలుసు. వారిని నాతో కలుపుకుపోవడం ఎలాగో బాగా తెలుసు.

కనుక త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేసుకొని 2031 ఎన్నికలలో పోటీ చేస్తాము. సామాన్య ప్రజలు రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం కాదు. వారి వద్దకే ప్రభుత్వం వచ్చి పనిచేయాలనే ఉద్దేశ్యంతోనే నేను ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బిజేపిలో చేరాను. కానీ కొన్ని అనివార్య కారణాల వలన పార్టీ వీడి బయటకు వచ్చాను,” అని అన్నామలై చెప్పారు.

అయన రాజీనామా చేసి ‘వియ్ ది లీడర్స్’ పేరుతో సోషల్ మీడియాలో ఓ ఉద్యమం ప్రారంభించారు. అది ప్రారంభించిన 24 గంటలలోనే దానిలో 14 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఇంకా లక్షల మంది చేరుతూనే ఉన్నారు. అంటే అన్నామలైకి తమిళనాడు ప్రజలలో, ముఖ్యంగా.. . యువతలో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్ధమవుతుంది.

తమిళనాడులో దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే మద్యనే అధికార మార్పిడి జరుగుతోంది. కనుక మార్పు తెస్తానంటూ కోలీవుడ్‌ నటుడు విజయ్‌ టీవీకే పార్టీతో వస్తే ప్రజలు పట్టం కట్టారు. అయన మార్పు తేగలరో లేదో తెలీదు. కానీ ఇప్పుడు అన్నామలై రాజకీయాలలో మార్పు తెస్తానంటున్నారు.

సమాజంలో, రాజకీయాలలో నైతిక విలువలు వేగంగా పడిపోతున్న ఈ రోజుల్లో విజయ్‌, అన్నామలై నీతి నిజాయితీగా రాజకీయాలు చేయడం సాధ్యమేనా? అంటే కాదని విజయ్‌ ఇప్పటికే నిరూపించారు. ఆయన తీవ్రంగా విమర్శించిన అన్నాడీఎంకేకి చెందిన 25 మంది ఎమ్మెల్యేల మద్దతు స్వీకరించడమే ఇందుకు నిదర్శనం. కనుక పళని స్వామి, స్టాలిన్, విజయ్‌ వలన కానిది అన్నామలై వలన సాధ్యపడుతుందా? ఏమో! కానీ మార్పు కోసం ఎవరో ఒకరు ప్రయత్నించకపోయినా అవినీతి పెరిగిపోతుంది. కనుక మార్పుని స్వాగతించాల్సిందే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

AK47: Trivikram & Naga Vamsi Fumble Golden Dasara Window

Venkatesh’s much-hyped Aadarsha Kutumbam AK 47, directed by Trivikram, has been indefinitely postponed. Producer Naga…

6 hours ago

New Passport Rules for Minors NRI Parents Must Know

The Ministry of External Affairs in India has amended the passport rules for minors of…

6 hours ago