Telugu

ఇంత ఓవర్ డైలాగ్స్ అయితే కష్టం బాస్!

‘పెళ్లిచూపులు’ సాధించిన అపూర్వ విజయమో లేక తను నటించిన సినిమాపై అపారమైన విశ్వాసమో గానీ… టాలీవుడ్ యువహీరో విజయ్ దేవరకొండ “అర్జున్ రెడ్డి” ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో కాస్త ఓవర్ గా ప్రసంగించారు. ఎవరైనా తాము చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్ముతారు, కానీ విజయ్ నమ్మకం ఆ పరిధిని దాటి అతి విశ్వాసంగా మారిందన్న సంకేతాలు ఈ ప్రసంగం ద్వారా కనపడుతోంది.

ADVERTISEMENT

“ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్, కావాలంటే ఎవరైనా బెట్ కాసుకోండి… నా అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ఇచేస్తా… బెట్టింగ్ లీగలేనా… నువ్వు చేస్తుంటావుగా…” అంటూ మరో సభ్యుడ్ని అడగగా వేదికపై ఉన్న వారంతా నవ్వేసారు. ఈ సినిమా ట్రైలర్ ను లాంచ్ చేసిన నాని నటిస్తున్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతోందని, ఇక నుండి బ్లాక్ బస్టర్ అయ్యే సినిమాల ట్రైలర్లు మాత్రమే నాని విడుదల చేస్తాడన్న పేరు వస్తుందని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా ఎందుకు కొన్నారా? అని అనుకునేవాళ్ళకు ఆగష్టు 25వ తేదీన తెలుస్తుందని… 150 రూపాయలు టికెట్ కొనుక్కుని ఒకటి, రెండు, మూడు సార్లు చూసినపుడు తెలుస్తుందని మరోసారి తన అతి విశ్వాసాన్ని వ్యక్తపరిచారు. నిజంగా ఎంత బాగున్నా… ఒక సాధారణ హీరో అయిన విజయ్ దేవరకొండ నటించిన “అర్జున్ రెడ్డి” సినిమాను ఒకటికి, మూడు సార్లు చూసేస్తారా?

ఇదేమైనా ‘బాహుబలి’ మాదిరి సినిమానా… ఒకటికి మూడు సార్లు చూడడానికి..! ఆ మాటకొస్తే ‘బాహుబలి’ని కూడా ఒకటికి మూడు సార్లు చూసిన ప్రేక్షకులు తక్కువే. అయినా ఇలా బహిరంగ వేదికలపై ముందుగానే ఓవర్ యాక్షన్ చేసిన వారికి ప్రేక్షకులు గతంలో దిమ్మతిరిగే తీర్పులను ఇచ్చిన సందర్భాలున్నాయి. మరి అలాంటివి రిపీట్ కాకుండా ఉంటే చాలు… ఒకటికి మూడు సార్లు చూసినంత గొప్ప..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇది ఆంధ్రా ప్రజల ఉసురా.. బీఆర్ఎస్‌ కర్మ ఫలమా?

నాడు సిఎం చంద్రబాబు నాయుడు అమరావతికి శ్రీకారం చుట్టి, పోలవరం పనులు పరుగులు పెట్టిస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఆయనను…

8 minutes ago

Action Or Warning? Konda Surekha In Spotlight

The Congress party is historically famous for leading group politics. There is very little dirty…

28 minutes ago