
[m9ad]
అసలు మ్యాటర్ ఏంటి అంటే టాలీవుడ్ లో తన వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ. అయితే చేసినవి పట్టుమని పది సినిమాలు లేకపోయినా తొలి సినిమా ‘పెళ్లి చూపులు’తోనే మన తెలుగు వారికి తెగ కనెక్ట్ అయిపోయాడు మన విజయ్. అయితే ప్రతీ హీరోలో అభిమానుల విషయంలో ఏదో ఒక రేర్ క్వాలిటీ ఉన్నట్లే, మన విజయ్ లో కూడా అభిమానుల విషయంలో ఆ ఇది కనిపించింది. తానే స్వయంగా తన నంబర్ నుంచి ఫోన్ చేసి తన అభిమానికి షాక్ ఇచ్చాడు విజయ్. అంతేనా, తన అభిమాని ఏం చేస్తున్నాడు? ఏం చదువుతున్నాడు? ఎగ్స్యామ్స్ రిసల్ట్స్ ఎప్పుడు? ఆ రిసల్ట్స్ వచ్చాక ఏం చెయ్యబోతున్నాడు? ఇలా అభిమాని కరియర్ గురించి అడిగి తెలుసుకున్నాడు విజయ్. ఇక అభిమానంతో ఊగిపోయిన సదరు అభిమాని, విజయ్ ని కలవాలి అని ఉత్సాహంగా ఉన్న క్రమంలో ఒక రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా నేనే కలుస్తా నిన్ను అంటూ విజయ్ చెప్పాడు. ఇక ఆ మాటకు ఫిదా అయిపోయిన సదరు అభిమాని, ఆనంద అంచుల్లో తెలిపోయాడు అంటే నమ్మండి.
ఏది ఏమైనా, ఇలాంటి ఆలోచనతో విజయ్ సరికొత్త పద్దతికీ శ్రీకారం చుట్టాడు అనే చెప్పాలి. ఎందుకంటే తాము నష్టపోయినా పర్వాలేదు కానీ, తమ అభిమాన హీరో సక్సెస్ అవ్వాలి అని ఆలోచించే పిచ్చి అభిమానులు మన హీరోలకు కోట్లల్లో ఉన్నారు. మరి అలాంటి హీరోనే తనకు తానే తన అభిమానిని పలకరిస్తే, అంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. అదన్న మాట అసలు మ్యాటర్.
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has written to Union Home Minister Amit Shah,…
Mythri Movie Makers has been supporting new talent through content-driven films. The production house has…