ఫ్యామిలీ స్టార్ డిజిటల్ అవ్వలేదా?

థియేటర్ రెవిన్యూ తగ్గడంతో నిర్మాతలు నాన్-థియేట్రికల్, హిందీ రైట్స్ నుండి వచ్చే సొమ్ముల మీద ఆధారపడి సినిమాలు తీస్తున్నారు. అయితే హిందీ మార్కెట్, డిజిటల్ మార్కెట్ ఒక్కేసారి డౌన్ అవ్వడంతో ఇండస్ట్రీలో ఒక మాదిరి సంక్షోభం మొదలయ్యింది.

చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి.

ADVERTISEMENT

బడా నిర్మాత దిల్ రాజు… విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యామిలీ స్టార్ కూడా ఇబ్బంది పడుతుందని సమాచారం.

డిజిటల్ లో ఇప్పుడు భారీగా ఖర్చుపెట్టి సినిమాలు కొంటుంది అమెజాన్, నెట్ ఫ్లిక్స్…. అయితే రెండు కంపెనీలు ఫ్యామిలీ స్టార్ కొనడానికి ఆసక్తి చూపించడం లేదు.

నెట్ ఫ్లిక్స్ సంక్రాంతి సినిమాల్లో ఇప్పటికే గుంటూరుకారం కొంది. ఫ్యామిలీ స్టార్ ఒక రోజు తేడాలో రిలీజ్ అవుతుంది.

రెండు సినిమాలు నాలుగు వారాలకు ఓటీటీలో రావాల్సిందే. గుంటూరుకారం భారీ రేటుకు కొని అదే టైం కి ఎక్కువకు ఫ్యామిలీ స్టార్ కొని ఒకేసారి వెయ్యడం అనేది ఫీజిబుల్ కాదు. కాబట్టి నెట్ ఫ్లిక్స్ ఫ్యామిలీ స్టార్ మీద ఇంటరెస్ట్ లేదు.

అమెజాన్ ప్రైమ్ వెంకటేష్ సైంధవ్ కొంది. అదే నాలుగు వారాలకు ఫ్యామిలీ స్టార్ కొని వెయ్యడం… అమెజాన్ కి కూడా కుదరదు.

దానితో సినిమా ఇప్పటివరకు అమ్ముడుపోలేదు.అని సమాచారం. 

విజయ్ లాంటి హీరో, దిల్ రాజు లాంటి పెద్ద నిర్మాత ఉన్న సినిమా డిజిటల్ రైట్స్ కి ఇబ్బంది రావడం షాకింగ్.

అయితే డిజిటల్ అమ్ముడు పోకపోయినా సంక్రాంతి బరిలో నుండి తప్పుకునే ప్రశ్న లేదంటున్నారు దిల్ రాజు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

14 ODIs Before IPL 2027: Ro-Ko’s Last Presence?

India will play 14 ODIs before IPL 2027 as the team prepares for the 2027…

12 minutes ago

Retro Fever Takes Over Tollywood

The 80s seem to be back in Tollywood. A trend that started on social media…

42 minutes ago