
తమిళనాడులో ఎలక్షన్స్ కి ఆంధ్రాకి పెద్ద కనెక్షన్ లేదు కానీ.. అక్కడి ఎలక్షన్ రిజల్ట్స్ మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి చాలా కీలకం కానుంది. అందుకు రీజన్ అక్కడ విజయ్ ఎలాంటి పొత్తు లేకుండా సోలోగా పోటీ చేయడమే. నిజానికి విజయ్ కి సరిగ్గా ఎలక్షన్స్ కి ముందు చాలా ఇబ్బందులు పడ్డాడు. తన “జన నాయగన్” సినిమాని రిలీజ్ అవ్వనివ్వకుండా ఆపేయడం, సరిగ్గా ఎలక్షన్స్ టైంలో విజయ్ భార్య విడాకులు ప్రకటించడం, తర్వాత కరూర్ ఘటనలో విజయ్ ని టార్గెట్ చేయడం వంటి వాటి కారణంగా విజయ్ ఎలక్షన్స్ లో గెలవడం అసాధ్యం అనే పరిస్థితి ఏర్పడింది.
అయితే.. ఎర్లీ ట్రెండ్స్ బట్టి చూస్తుంటే.. విజయ్ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం ఫామ్ చేయలేకపోయినా, కనీసం 50 సీట్ల దాకా గెలిచి అపోజిషన్ గా నెగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి 90కి పైగా సీట్లలో ముందంజలో ఉంది విజయ్ పార్టీ.
అక్కడ తమిళనాట విజయ్ ముందంజ.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి టెన్షన్ గా మారింది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ మొదటిసారి ఎలక్షన్స్ లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు గెలుచుకొని దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. రెండోసారి గెలిచినప్పటికీ.. అది పొత్తు వల్లే అనేది అందరూ ఒప్పుకునే విషయం.
సో, సోషల్ మీడియాలో వైసీపీ పార్టీ మొదలుకొని ఇతర హీరోల ఫ్యాన్ డమ్స్ అన్నీ పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేయడం ఖాయం. మరి దీన్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా డిఫెండ్ చేసుకుంటారు అనేది చూడాలి. ఎందుకంటే.. డిఫెండ్ చేయడానికి పెద్ద స్కోప్ కూడా పవన్ ఫ్యాన్స్ లేదు.
India's 351/7 looked like a strong enough total, but the third ODI against West Indies…
Legendary filmmaker Singeetham Srinivasa Rao has passed away at Kauvery Hospital in Chennai following ill…